Share News

మామిడిలో సస్యరక్షణ చేపట్టాలి

ABN , First Publish Date - 2023-11-29T00:48:21+05:30 IST

మామిడిలో పూత నుంచి కాపు వరకు సస్యరక్షణ యాజమాన్య పద్ధతుల ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చునని జిల్లా ఉద్యాన అధికారి మధుసూదన్‌రెడ్డి సూచించారు.

మామిడిలో సస్యరక్షణ చేపట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఉద్యాన అధికారి మధుసూదన్‌రెడ్డి

చిత్తూరు (సెంట్రల్‌), నవంబరు 28: మామిడిలో పూత నుంచి కాపు వరకు సస్యరక్షణ యాజమాన్య పద్ధతుల ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చునని జిల్లా ఉద్యాన అధికారి మధుసూదన్‌రెడ్డి సూచించారు. మంగళవారం స్థానిక మ్యాంగో భవన్‌లో మామిడిలో వచ్చే చీడపీడలు, తెగుళ్లు వాటి నివారణ పద్ధతులు, పంట దిగుబడికి పాటించాల్సిన జాగ్రత్తలపై ఆర్‌బీకే సిబ్బంది, రైతులకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ శాఖాధికారి మురళీకృష్ణ, ఉద్యాన అధికారి మధుసూదన్‌రెడ్డి, ఉద్యాన శాస్త్రవేత్త శ్రీనివాసులు రైతులకు పలు సూచనలు చేశారు.

Updated Date - 2023-11-29T00:48:22+05:30 IST