Share News

‘ఆడుదాం ఆంధ్రా’కు పేర్లు నమోదు చేసుకోండి

ABN , First Publish Date - 2023-11-28T01:56:14+05:30 IST

ఆడుదాం ఆంధ్రా క్రీడా (మస్కట్‌-లోగో) పోస్టర్‌ను సోమవారం తన ఛాంబర్‌లో కలెక్టర్‌ షన్మోహన్‌ విడుదల చేశారు. డిసెంబరు 15 నుంచి 2024 ఫిబ్రవరి 3 వరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీలను ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తోందని తెలిపారు.

‘ఆడుదాం ఆంధ్రా’కు పేర్లు నమోదు చేసుకోండి
ఆడుదాం ఆంధ్రా పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ షన్మోహన్‌

చిత్తూరు (సెంట్రల్‌), నవంబరు 27: ఆడుదాం ఆంధ్రా క్రీడా (మస్కట్‌-లోగో) పోస్టర్‌ను సోమవారం తన ఛాంబర్‌లో కలెక్టర్‌ షన్మోహన్‌ విడుదల చేశారు. డిసెంబరు 15 నుంచి 2024 ఫిబ్రవరి 3 వరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీలను ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తోందని తెలిపారు. క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ అంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. డిసెంబరు 13 వరకు నమోదు ప్రక్రియ జరుగుతుందన్నారు. 15 సంవత్సరాలు పైబడిన స్త్రీ, పురుషులు పోటీల్లో పాల్గొనేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో వలంటీర్ల వద్ద పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. టోల్‌ ఫ్రీ నెంబరు 1902ను ఉపయోగించి సైతం నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్‌ అధికారి బాలాజీ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-28T01:56:17+05:30 IST