Share News

యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడమే లక్ష్యం

ABN , First Publish Date - 2023-11-29T00:39:25+05:30 IST

యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడమే ‘ఆడుదాం ఆంధ్రా’ లక్ష్యమని కలెక్టర్‌ షన్మోహన్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు

యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడమే లక్ష్యం

చిత్తూరు (సెంట్రల్‌), నవంబరు 28: యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడమే ‘ఆడుదాం ఆంధ్రా’ లక్ష్యమని కలెక్టర్‌ షన్మోహన్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డిసెంబరు 15 నుంచి దాదాపు 51 రోజుల పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో మొత్తం పది వేల పోటీలు నిర్వహిస్తామన్నారు. జిల్లాస్థాయిలో గెలిచిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. అందుకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయిలో ఎంపీడీవోలు, నియోజకవర్గ స్థాయిలో ఆర్డీవోలు, జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని వివరించారు. డీఈవో విజయేంద్రరావు సమన్వయంతో క్రీడాకారులకు పీఈటీ, పీడీలు శిక్షణ ఇస్తారన్నారు. మైదానాల్లో మెడికల్‌ టీం అందుబాటులో ఉంటుందన్నారు. డిసెంబరు 10వ తేదీలోపు ఒక్కొక్కరు గరిష్ఠంగా రెండు క్రీడల్లో గ్రామ, వార్డు వలంటీర్ల వద్ద నమోదు చేసుకోవచ్చని వివరించారు. ఈ సమావేశంలో జేసీ శ్రీనివాసులు, డీఈవో విజయేంద్రరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:39:26+05:30 IST