Share News

ముసాయిదా ఓటర్ల జాబితాపై రీ వెరిఫికేషన్‌ చేపట్టాలి

ABN , First Publish Date - 2023-11-29T00:40:39+05:30 IST

కాకినాడ సిటీ, నవంబరు 28: జిల్లాకు సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని, దీనిపై వెరిఫికేషన్‌ చేప ట్టాలని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మంగళవారం జిల్లా కలె క్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి కృతికాశుక్లాకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు అందజేసిన వినతిపత్రంలో ముసాయిదా ఓటర్ల జాబితాలో డబుల్‌ ఎంట్రీలు, డూప్లికేట్‌ ఐడీలు, మల్టీఫుల్‌ ఎంట్రీలు, ఒకే ఇంటి డోర్‌ నంబర్‌

ముసాయిదా ఓటర్ల జాబితాపై రీ వెరిఫికేషన్‌ చేపట్టాలి
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే కొండబాబు, నాయకులు

జిల్లా కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఫిర్యాదు

కాకినాడ సిటీ, నవంబరు 28: జిల్లాకు సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని, దీనిపై వెరిఫికేషన్‌ చేప ట్టాలని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మంగళవారం జిల్లా కలె క్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి కృతికాశుక్లాకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు అందజేసిన వినతిపత్రంలో ముసాయిదా ఓటర్ల జాబితాలో డబుల్‌ ఎంట్రీలు, డూప్లికేట్‌ ఐడీలు, మల్టీఫుల్‌ ఎంట్రీలు, ఒకే ఇంటి డోర్‌ నంబర్‌తో పదిమంది కంటే ఎక్కువమంది ఓటర్లు, జీరో డోర్‌ నంబర్లు ఉన్న ఓటర్లు యఽఽథావిధిగా ప్రచురితమయ్యాయని వివరించారు. ఈ సందర్భంగా కొండబాబు మీడియాతో మాట్లాడుతూ అధికారం కోసం వైసీపీ అడ్డ దారులు తొక్కుతోందన్నారు. కాకినాడ జిల్లావ్యాప్తంగా 17,230 మరణించిన వారి ఓట్లు, 5553 డబుల్‌ ఎంట్రీ ఓట్లు, 8681 మైగ్రేటెడ్‌ ఓట్లు, 19,188 డూప్లికేట్‌ ఓట్లు, 653 జీవో డోర్‌ నంబర్‌ ఓట్లు, 17,589 నాన్‌ అవైలబుల్‌ ఓట్లు యఽథావిధిగా ప్రచురించారన్నారు. అదేవిధంగా కాకినాడ నగరంలో అధికార పార్టీ నాయకులు, టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపు, బల్క్‌గా నమోదుచేసిన ఫారాలపై ఫిర్యాదుచేసినా నేటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. కాకినాడ నగర ఎన్నికల అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ఇన్‌చార్జి కమిషనర్‌పై పలు ఆరోపణలు ఉన్నప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నా రు. ఇప్పటికైనా తప్పులతడకగా ఉన్న ముసాయిదా ఓటర్‌ జాబితాపై తగు చర్యలు తీ సుకోవాలన్నారు. టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్‌, వొమ్మి బా లాజీ, ఎండీ ఖాన్‌, ఎండీ అన్సర్‌, ఏవీడీ మెంటారావు, జొన్నాడ వెంకటరమణ, గుమ్మళ్ల చిన్న, కొప్పాడ రాజు, కలిదిండి సురేష్‌, సయ్యద్‌ ఆలీ, పిన్నమ్మరెడ్డి బుజ్జి పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:40:40+05:30 IST