Share News

ఫూలే కాంక్షించిన సమసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి : జేసీ

ABN , First Publish Date - 2023-11-29T01:19:04+05:30 IST

కాకినాడ సిటీ, నవంబరు 28: మహాత్మా జ్యోతీరావ్‌ ఫూలే కాంక్షించిన సమ సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ ఇలక్కియా అన్నారు. ఫూలే వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం స్థానిక జీజీహెచ్‌ సెంటర్‌లోని ఫూలే విగ్రహానికి జేసీ ఇలక్కియా, ఎమ్మెల్సీ కర్రి పద్మ శ్రీ, రాష్ట్ర అయ్యార

ఫూలే కాంక్షించిన సమసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి : జేసీ
జ్యోతీరావ్‌ ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న జేసీ

కాకినాడ సిటీ, నవంబరు 28: మహాత్మా జ్యోతీరావ్‌ ఫూలే కాంక్షించిన సమ సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ ఇలక్కియా అన్నారు. ఫూలే వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం స్థానిక జీజీహెచ్‌ సెంటర్‌లోని ఫూలే విగ్రహానికి జేసీ ఇలక్కియా, ఎమ్మెల్సీ కర్రి పద్మ శ్రీ, రాష్ట్ర అయ్యారక కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ ఆవాల రాజేశ్వరి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పసుపులేటి వెంకటలక్ష్మితోపాటు పలువురు ప్రముఖులు పూలమా లలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వంతో కూడిన సమాజం కోసం ఉద్యమం సాగించిన ఫూలే గొప్ప సం ఘ సంస్కర్త అని కొనియాడారు. ఎమ్మెల్సీ పద్మశ్రీ మాట్లాడుతూ ఫూలే ఆశ యాల స్ఫూర్తితోనే ప్రభుత్వం బడుగు బలహీనవర్గాలు, మహిళల అభ్యున్న తికి, సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలుచేస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి నౌడు రాజేశ్వరి, బీసీ కార్పొరేషన్‌ ఈడీ అద్దంకి శ్రీని వాసరావు, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ డీవీ రమణమూర్తిలు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T01:19:05+05:30 IST