Konaseema Dist.: మంత్రి వేణుకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తల విస్తృత సమావేశం

ABN , First Publish Date - 2023-07-16T12:55:10+05:30 IST

మంత్రి వేణుకు వ్యతిరేకంగా ఆదివారం ఉదయం రామచంద్రపురంలో వైసీపీ కార్యకర్తలు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ కార్యకర్తలపై మంత్రి వేణు అక్రమ కేసులు బనాయిస్తున్నరని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Konaseema Dist.: మంత్రి వేణుకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తల విస్తృత సమావేశం

కోనసీమ జిల్లా: మంత్రి వేణు (Minister Venu)కు వ్యతిరేకంగా ఆదివారం ఉదయం రామచంద్రపురంలో వైసీపీ కార్యకర్తలు (YCP Activists) విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ కార్యకర్తలపై మంత్రి వేణు అక్రమ కేసులు బనాయిస్తున్నరని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వేణుకు టికెట్ కేటాయించకూడదని డిమాండ్ చేశారు. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ (MP Pilli Subhash Chandra Bose) తనయుడు సూర్య ప్రకాష్‌ (Surya Prakash)కు టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేయనున్నారు. ఎంపీ సుభాష్ ఏ నిర్ణయం తీసుకున్న వెంటే ఉంటామని క్యాడర్ స్పష్టం చేసింది. ఒకవేళ వైసీపీలో సీటు రాకపోతే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేయాలని భావిస్తున్నారు. కాగా టీడీపీ (TDP)లో చేరి వేణుపై బరిలోకి దిగాలని మరికొందరు ఒత్తిడి చేశారు. మంత్రి వేణు తీరుపై పార్టీ కార్యకర్తలు ఏకగ్రీవంగా మండిపడ్డారు.

కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలం నియోజక వర్గంలో ప్రజలు మంత్రి వేణుకు షాక్ ఇచ్చారు. వెంకటాయపాలెంలో మంత్రి వేణుకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రెండు వేల మందితో ఎంపీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ వర్గీయులు భేటీ అయ్యారు. నియోజకవర్గంలో వైసీపీ గెలుపులో కీలకపాత్ర వహించిన కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

Updated Date - 2023-07-16T12:55:10+05:30 IST