Share News

అన్న చేతిలో తమ్ముడి హతం

ABN , First Publish Date - 2023-11-29T00:12:41+05:30 IST

ఆస్తి తగాదాలతో తోడబుట్టిన తమ్ముడిని అతి కిరాతకంగా చంపేశాడు ఓ అన్న.. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం గుడివాడలో ఈ దారుణ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన నల్లంశెట్టి కృష్ణ మూర్తికి ఉదయభాస్కర్‌ (55), త్రిమూర్తులు ఇద్దరు కుమారులు ఉన్నారు.

అన్న చేతిలో తమ్ముడి హతం

పెద్దాపురం, నవంబరు 28: ఆస్తి తగాదాలతో తోడబుట్టిన తమ్ముడిని అతి కిరాతకంగా చంపేశాడు ఓ అన్న.. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం గుడివాడలో ఈ దారుణ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన నల్లంశెట్టి కృష్ణ మూర్తికి ఉదయభాస్కర్‌ (55), త్రిమూర్తులు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండేళ్ల కిందట తండ్రి కృష్ణమూర్తి ఇద్దరి కుమారులకు ఆస్తిని పంచి ఒక ఎకరం పొలాన్ని తన పేరున ఉంచుకున్నాడు. అయితే అన్నదమ్ములు అయిన ఉదయభాస్కర్‌, త్రిమూర్తులకు గత 3 నెలలుగా తండ్రి పేరుతో ఉన్న ఎకరం పొలం విషయంపై గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం కూడా వీరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ తార స్థాయికి చేరడంతో తమ్ముడైన ఉదయభాస్కర్‌ను కోపోద్రిక్తుడైన అన్న త్రిమూర్తులు గునపంతో పొడవడంతో అక్కడికక్కడే ఉదయభాస్కర్‌ మృతిచెందాడు. ఉదయభాస్కర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న సీఐ వై.రవికుమార్‌, ఎస్‌ఐ వెలుగుల సురేష్‌ సంఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేశారు.

Updated Date - 2023-11-29T00:12:43+05:30 IST