Share News

పనులు చేయలేం!

ABN , First Publish Date - 2023-11-29T00:24:13+05:30 IST

వైసీపీ ప్రభుత్వం చెప్పిన పనులు చేయడానికి కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. గతంలో ప్రభుత్వ పనికి కాంట్రాక్టర్లు పోటీపడేవారు. అధికారులకు ఎంతో కొంత ముట్టచెప్పి పనులు వచ్చేలా చేసుకు నేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. వైసీపీ ప్రభుత్వంలో ఓరోడ్డు వేయాలన్నా, ఓ డ్రైను కట్టా లన్నా..ఓ పైపులైన్‌ వేయాలన్నా కూడా కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు.

పనులు చేయలేం!

పాత బిల్లులకు కాంట్రాక్టర్ల డిమాండ్‌

(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి)

వైసీపీ ప్రభుత్వం చెప్పిన పనులు చేయడానికి కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. గతంలో ప్రభుత్వ పనికి కాంట్రాక్టర్లు పోటీపడేవారు. అధికారులకు ఎంతో కొంత ముట్టచెప్పి పనులు వచ్చేలా చేసుకు నేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. వైసీపీ ప్రభుత్వంలో ఓరోడ్డు వేయాలన్నా, ఓ డ్రైను కట్టా లన్నా..ఓ పైపులైన్‌ వేయాలన్నా కూడా కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. దీనికి కారణం వారు పనులు చేసినా బిల్లులు ఇవ్వకపోవడమే. ఏడాది కిందట వైసీపీ ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సీఎం డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (సీఎండీఎఫ్‌) ద్వారా రూ. 2కోట్లు మం జూరు చేస్తున్నామని, వీటితో సిమెంట్‌ రోడ్లు, సిమెంట్‌ డ్రైన్లు నిర్మించాలని ప్రకటించింది. ఇది మహాభాగ్యంగా ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్లు భావిం చారు. జిల్లాలో పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ ద్వారా సుమారు 12మంది కాంట్రాక్టర్లు మొత్తం 28 పనులు చేశారు. సీఎం పేరుతో నిధులు కదా, ఖచ్చితంగా ఇస్తారని నమ్మారు. కానీ ఇప్పటికీ ఒక్క పైసా కూడా రిలీజ్‌ చేయలేదు.దీనితో అప్పో సప్పో చేసి పనులు చేసిన కాంట్రాక్టర్లు బోరున విలపిస్తున్నారు. ఎవరిని అడిగినా ఎవరూ పట్టిం చుకునే పరిస్థితి లేదు. దీంతో కొందరు కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం. మిగతావారు కూడా కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారు.జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు రూ.14 కోట్లు రావలసింది. ఇక మూడు నెలల్లో ఎన్నికలు రాను న్నాయి. ఇపుడు బిల్లులు రాకపోతే, పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ పరి స్థితుల్లో ఏ పనులూ చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. వైసీపీ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేపట్టిన వాటర్‌గిడ్‌లో మార్పులు చేసి, జలజీవన్‌ మిషన్‌ను కొంతమేర అమలు చేయనున్నట్టు ప్రకటించింది. జిల్లాలో రూ.168కోట్లతో 413 పనులు శాంక్షన్‌ చేసింది. కానీ ఇప్పటి వరకూ కేవలం రూ.50 కోట్లతో 228 పనులు చేశారు. అవి కూడా బిల్లులు పూర్తి కాలేదు. ఎన్నికల ముందు గ్రామాల్లో హడావిడి చేయడానికి ఇటీవల రూ.105 కోట్లతో 226 పనులు చేపడుతున్నట్టు ప్రకటించారు. కానీ కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో కమ్యూనిటీ కాంట్రాక్టింగ్‌ సిస్టమ్‌ ద్వారా ప్రజలచేతే, అంటే గ్రామాల్లో సర్పంచ్‌, లేదా వైసీపీ కార్యకర్తల చేత పనులు చేయించడానికి ప్రయత్నం చేస్తు న్నారు. దీనికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. కాంట్రాక్టర్లకే బిల్లులు రానన్నపుడు ఇప్పుడెలా ఇస్తారనే అనుమానం పెరిగింది.

Updated Date - 2023-11-29T00:24:17+05:30 IST