Amaravati: సీఎం జగన్‌తో సమావేశమైన పిల్లి సుభాష్ చంద్రబోస్
ABN , First Publish Date - 2023-07-18T15:06:59+05:30 IST
అమరావతి: అంబేద్కర్ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం వైకాపా నేతల పంచాయతీ తాడేపల్లికి చేరింది. మంత్రి చెల్లుబోయిన వేణు, పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య తీవ్రమైన విభేధాలు నెలకొన్నాయి. ఇరు వర్గాలు పరస్పర తీవ్ర ఆరోపణలు, దాడులు చేసుకున్నారు.
అమరావతి: అంబేద్కర్ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం వైకాపా నేతల పంచాయతీ తాడేపల్లికి చేరింది. మంత్రి చెల్లుబోయిన వేణు (Chelluboina Venu), పిల్లి సుభాష్ చంద్రబోస్ (Pilli Subhash Chandra Bose) మధ్య తీవ్రమైన విభేధాలు నెలకొన్నాయి. ఇరు వర్గాలు పరస్పర తీవ్ర ఆరోపణలు, దాడులు చేసుకున్నారు. విబేధాల పరిష్కారం కోసం సీఎం కార్యాలయం నుంచి పిల్లి సుభాష్‌కు పిలుపు వచ్చింది. దీంతో ఆయన మంగళవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ (CM Jagan)తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి చెల్లుబోయిన వేణుపై ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో మంత్రి వేణు సహా ఆయన వర్గీయుల వ్యవహారశైలిని సీఎంకు పిల్లి సుభాష్ వివరించారు. తన అనుచరుడు కోలమూరి శివాజీపై మంత్రి వేణు అనుచరుడు దాడి చేశారన్నారు. పిల్లి సుభాష్‌తో సీఎం జగన్ సమావేశం అరగంట పాటు జరిగింది. కాగా నిన్న క్యాంపు కార్యాలయానికి వచ్చిన పిల్లి సుభాష్ చంద్రబోస్ వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జలతో సమావేశమై మంత్రి వేణుపై ఫిర్యాదు చేశారు.
మరోవైపు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్‌కు ఈ సారి టికెట్ ఇవ్వాలని పిల్లి సుభాష్ వర్గీయుల పట్టుపడుతున్నారు. ఈ నెల 16న పిల్లి సుభాష్ తన అనుచర వర్గంతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సారి మంత్రి వేణుకు రామచంద్రాపురం టికెట్ ఇస్తే ఓడించి తీరతామని పిల్లి సుభాష్ వర్గం స్పష్టం చేసింది. నియోజక వర్గంలో వివిధ విద్యుత్ ఉప కేంద్రాల్లో స్విచ్ ఆపరేటర్ల నియామానికి మంత్రి లక్షల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రణాళిక ప్రకారం మంత్రి వేణు శెట్టి బలిజలను తొక్కేస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రి వేణు ఇసుకదోపిడీ చేస్తూ, అవినీతి, అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో పిల్లి సుభాష్ తనయుడు సూర్యప్రకాష్‌కు టికెట్ ఇవ్వాలని పిల్లి సుభాష్ వర్గం తీర్మానం చేశారు. ఈ నెల 26న అమలాపురం రానున్న సీఎంకు ఈ తీర్మానం ఇవ్వాలని వారు నిర్ణయించారు. కాగా వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నియోజకవర్గ వైకాపా అభ్యర్థి తానే నంటూ మంత్రి వేణు గోపాల కృష్ణ ప్రకటించారు.