Share News

ఓటర్ల జాబితాల్లో అవకతవకలు

ABN , First Publish Date - 2023-11-29T00:41:44+05:30 IST

పిఠాపురం, నవంబరు 28: నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాల్లో పలు అవకతవకలు ఉన్నాయని వాటిని సరి చేయాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం నియోజకవర్గ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, కుడా వైస్‌చైర్మన్‌ సుబ్బారావును

ఓటర్ల జాబితాల్లో అవకతవకలు

ఈఆర్వోకు మాజీ ఎమ్మెల్యే వర్మ ఫిర్యాదు

పిఠాపురం, నవంబరు 28: నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాల్లో పలు అవకతవకలు ఉన్నాయని వాటిని సరి చేయాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం నియోజకవర్గ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, కుడా వైస్‌చైర్మన్‌ సుబ్బారావును కలిసి వినతిపత్రం అందజేశారు. అక్టోబరు 27న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 2,953మంది చనిపోయినవారి ఓటర్ల పేర్లు జాబితాలో ఉన్నాయని, వలసవెళ్లిన వారివి 623, అందుబాటులో లేని వారివి 3,850, డూప్లికేట్‌ ఎంట్రీలు 527 ఉన్నాయని వివరించారు. పట్టణంలోని పోలింగ్‌బూత్‌ 148లో బార్య, భర్తల పేర్లు డోర్‌ నెంబర్లు వేర్వేరుగా ఉన్నాయని, ఇంటింటికి సర్వే చేసి తీసుకున్న ఫారం 6,7,8లను ఇంకా జాబితాలో అప్‌డేట్‌ చేయలేదని తెలిపారు. ఒకే డోర్‌నెంబరుపై అధికంగా ఓట్లు ఉన్నాయని చెప్పారు. వీటిపై విచారణ జరిపి ఓటర్ల జాబితాలను సరిచేయాలని ఆయన కోరారు.

Updated Date - 2023-11-29T00:41:45+05:30 IST