Share News

రిజిస్ట్రేషన్లకు కుస్తీ

ABN , First Publish Date - 2023-11-29T00:22:22+05:30 IST

ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా తాను అనుకున్నది చేసి తీరాల్సిందనే మంకుపట్టును ప్రభుత్వం వీడడం లేదు.

 రిజిస్ట్రేషన్లకు కుస్తీ

తొలిరోజు 34 రిజిస్ర్టేషన్లు పూర్తి

రాజమహేంద్రవరం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా తాను అనుకున్నది చేసి తీరాల్సిందనే మంకుపట్టును ప్రభుత్వం వీడడం లేదు. జగమొండి పాలనతో ప్రజలకు ఇక్కట్లు నిత్యకృత్యమైపో యాయి. ఈ క్రమంలో జిల్లాలో నూతన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల విధానం కార్డ్‌ ప్రైమ్‌ 2.0ని మంగళవారం(28) నుంచి అమల్లోకి తీసుకొచ్చేసింది.పాత విధానానికి 27వ తేదీతో స్వస్తి పలికింది. ఇప్పటి వరకూ ఏదైనా ఆస్తి కొన్నా.. అమ్మినా సబ్‌-రిజిస్ట్రారు కార్యాలయానికి యజమాని, క్రయం పొందు తున్న వారు భౌతికంగా హాజరు కావాలి. కొంత ప్రక్రియ అనంతరం సబ్‌-రిజిస్ట్రారు సంతకం చేసిన తర్వాత కొన్న వారికి సదరు ఆస్తిపై సర్వహక్కులూ దఖలు పడుతూ రిజిస్ట్రేషను అయినట్టు పరిగణిస్తారు. ఇంత తతంగం ఉన్నా ఒరిజినల్‌కి తీసి పోని విధంగా నకిలీ డాక్యుమెంట్లు పుట్టుకొ స్తున్నాయి. మరి ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఎవరికివారే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకొనే విధానం ఎంత వరకూ భద్రం.మన వేలిముద్రను సేకరించి ఖాతాల్లో డబ్బులు మా యం చేసే కేటుగాళ్లు ఉన్న ఈ రోజుల్లో ఆస్తుల రిజిస్ట్రేషను పూర్తిగా ఆన్‌లైన్‌లో చేస్తే రక్షణ ఎంత? తెల్లకాగితంపై రాతలకు భరోసా ఏమిటి? అని ప్రజలు ఆందోళన పడుతూ ఉంటే ప్రభుత్వం మాత్రం కొత్త ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల విధా నంపై మొండిగా ముందుకెళుతోంది.సెప్టెంబరు 1, సెప్టెం బరు 5న రెండుసార్లు ప్రయత్నించి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం చివరకు అనుకున్నంత పనీ చేసింది. జిల్లాలోని 12 సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయాల్లో రోజుకు సరాసరి 100కిపైనే రిజి స్ట్రేషన్లు జరుగుతాయి. అయితే, కార్డ్‌ ప్రైమ్‌ 2.0 ప్రవేశపెట్టిన తొలి రోజున కొన్ని సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయాల్లో అసలు రిజిస్ట్రేషన్లు జరగలేదు. మిగతావాటిలో మంగళవారం సాయంత్రం 7గంటల సమయానికి కేవలం 34 రిజిస్ట్రేషన్లు మాత్రమే పూర్తయ్యాయి. సాంకేతిక సమస్యలు తలెత్తుతుం డడంతో సబ్‌ రిజిస్ర్టార్లకు కుస్తీ తప్పడం లేదు. అటు ప్రజల్లో అయోమయం వ్యక్తమవుతోంది. కొందరు సబ్‌ రిజిస్ట్రార్లు తొలిరోజున అసలు కొత్త విధానంలో రిజిస్ట్రేషన్లు చేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. దీంతో ఆయా కార్యాలయాల పరిధిలో పాత పద్ధతినే అవలంభించారు. చాలా చోట్ల క్రయవిక్రయ దారులు వ్యతిరేకిస్తున్నా పైఅఽ దికారుల ఒత్తిడితో వాళ్లకు స్థానిక అధికారులు సర్దిచెప్పి కొత్త విధానంలో రిజిస్ట్రేన్లకు ఒప్పిస్తున్నారని సమాచారం. ఈ తతంగంతో ఆందోళన చెందుతున్న కొందరు రిజిస్ట్రేషన్లను వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది.సాంకేతిక సమస్యలు అధిగమి స్తున్నామని, క్రయవిక్రయదారులు వాళ్లకు వాళ్లే రిజిస్ట్రేషను ప్రక్రియ పూర్తి చేసుకోవడం రిజిస్ట్రేషన్ల చరిత్రలో పెద్ద మార్పని జిల్లా రిజిస్ట్రారు ఆనందరావు పేర్కొన్నారు.

కొత్త విధానం ఇదీ..

నూతన విధానంతో ప్రజల్లో ఆందోళన నెలకొనడమే కాకుండా డాక్యుమెంట్‌ రైటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మా రింది.ఏళ్ల తరబడి వస్తున్న పాత రిజిస్ట్రేషన్ల విధానానికి సోమవారంతో స్వస్తి పలికింది.కొత్త వెబ్‌సైటులో లాగినై దస్తావేజు రకాన్ని ఎంపిక చేసుకోవాలి. అవసరమైన ఫార్మా ట్‌ని ఎంపిక చేసుకోవాలి. వివరాలను నమోదు చేసి సబ్‌- రిజిస్ట్రారుకు లింకు రూపంలో పంపించాలి. ఆయన దానిని పరిశీలించి ఏవైనా మార్పులుంటే సూచిస్తూ మళ్లీ మెయిల్‌ ద్వారా దరఖాస్తుదారుడికి పంపిస్తారు. ఇలా ఓకే అయిన తర్వాత.. క్రయవిక్రయదారులు సబ్‌ రిజిస్ట్రారు ముందు హాజ రుకావాల్సి ఉంటుంది. వాళ్లతోపాటు సబ్‌ రిజిస్ట్రారు కూడా డాక్యుమెంట్‌పై ఈసైన్‌ చేస్తారు. ఏదేమైనా క్రయవిక్రయ దారులు సులభంగా రిజిస్ట్రేషను చేసుకోవచ్చని డాక్యుమెంట్‌ రైటర్లతో పని ఉండదని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2023-11-29T00:22:24+05:30 IST