Share News

నేడు కుమార రామ భీమేశ్వరాలయ కొనేరు పుష్కరిణిలో తెప్పోత్సవం

ABN , First Publish Date - 2023-11-29T01:20:12+05:30 IST

సామర్లకోట, నవంబరు 28: కార్తీకమాస పర్వదినాలు పురస్కరించుకుని సామర్లకోట కుమారరామ భీమేశ్వరా లయంలో బుధవారం సాయంత్రం 5.30 గంటలకు కోనేరు పుష్కరిణిలో స్వామివారి, అమ్మవారి తెప్పోత్సవం వైభవంగా జరుపనున్నట్టు ఆలయ చీఫ్‌ ఫెస్టివల్‌ అధి కారిణి అల్లు వెంకట దుర్గాభవాని చె

నేడు కుమార రామ భీమేశ్వరాలయ కొనేరు పుష్కరిణిలో తెప్పోత్సవం

సామర్లకోట, నవంబరు 28: కార్తీకమాస పర్వదినాలు పురస్కరించుకుని సామర్లకోట కుమారరామ భీమేశ్వరా లయంలో బుధవారం సాయంత్రం 5.30 గంటలకు కోనేరు పుష్కరిణిలో స్వామివారి, అమ్మవారి తెప్పోత్సవం వైభవంగా జరుపనున్నట్టు ఆలయ చీఫ్‌ ఫెస్టివల్‌ అధి కారిణి అల్లు వెంకట దుర్గాభవాని చెప్పారు. తెప్పోత్సవ దాతలు కటకం సతీష్‌ సోదరుల ఆధ్వర్యంలో ఆలయ పండితులు ముందుగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి విద్యుద్దీపాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన హంసవాహనంపై తెప్పోత్సవం నిర్వహిస్తామని, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తెప్పోత్సవం తిలకించి ప్రసా దాలను స్వీకరించాలని సీఎఫ్‌వో దుర్గాభవాని కోరారు.

Updated Date - 2023-11-29T01:20:13+05:30 IST