K Raghavendra Rao on Chandrababu Arrest : ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది

ABN , First Publish Date - 2023-09-09T13:35:21+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ అట్టుడుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు అరెస్ట్‌పై స్పందిస్తున్నారు. కాసేపటి క్రితం ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు సైతం స్పందించారు.

K Raghavendra Rao on Chandrababu Arrest : ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ అట్టుడుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు అరెస్ట్‌పై స్పందిస్తున్నారు. కాసేపటి క్రితం ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు సైతం స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందన్నారు. ఒక విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్ర బాబు నాయుడుని అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికమన్నారు. ఏపీలో ఉన్నఅంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయని కె.రాఘవేంద్రరావు పేర్కొన్నారు.

Updated Date - 2023-09-09T13:35:21+05:30 IST