Share News

BTech Ravi : టీడీపీ సీనియర్ నేత బీటెక్ రవి కిడ్నాప్.. చేతులెత్తేసిన పోలీసులు

ABN , First Publish Date - 2023-11-14T21:19:41+05:30 IST

టీడీపీ సీనియర్ నేత బీటెక్ రవి ( BTech Ravi ) కిడ్నాప్‌‌నకు గురయ్యారు. కడప నుంచి పులివెందుల వస్తుండగా బీటెక్ రవిని 20 మంది ఆగంతకులు అదుపులోనికి తీసుకెళ్లారు.

BTech Ravi : టీడీపీ సీనియర్ నేత బీటెక్ రవి కిడ్నాప్.. చేతులెత్తేసిన పోలీసులు

కడప : టీడీపీ సీనియర్ నేత బీటెక్ రవి ( BTech Ravi ) కిడ్నాప్‌‌నకు గురయ్యారు. కడప నుంచి పులివెందుల వస్తుండగా బీటెక్ రవిని 20 మంది ఆగంతకులు ఎత్తుకెళ్లారు!. విషయం తెలుసుకున్న రవి సతీమణి భయాందోళనకు గురై స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. అయితే రవికి సంబంధించిన ఎలాంటి సమాచారం తమకు తెలియదని పోలీసులు చేతులెత్తేశారు!. దీంతో రవిని తీసుకెళ్లిందెవరు..? అసలేం జరిగింది..? అనేది తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇంత జరిగినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఆయన శత్రువులే ఈ పనిచేశారా..? లేకుంటే అధికార పార్టీ నేతలు ఈ చర్యకు పాల్పడ్డారా..? అనేది తెలియాల్సి ఉంది. కాగా.. ఈ ఘటనపై హెబియస్‌ కార్పస్‌ పిటిషన్ వేసే ఆలోచనలో కుటుంబసభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-11-14T21:27:03+05:30 IST