Share News

ఆదర్శనీయుడు జ్యోతిరావు ఫూలే

ABN , First Publish Date - 2023-11-29T00:47:16+05:30 IST

బీసీల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన దివంగత జ్యోతిరావు ఫూలే సేవలు ఆదర్శనీయమని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, టీడీపీ బీసీ నేతలు శొంఠి శివరాం ప్రసాద్‌, సంగెపు రంగారావు, పీతా గోపీచంద్‌ పేర్కొన్నారు.

 ఆదర్శనీయుడు జ్యోతిరావు ఫూలే
పోరంకి టీడీపీ కార్యాలయంలో జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న టీడీపీ బీసీ నాయకులు

పెనమలూరు, నవంబరు 28 : బీసీల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన దివంగత జ్యోతిరావు ఫూలే సేవలు ఆదర్శనీయమని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, టీడీపీ బీసీ నేతలు శొంఠి శివరాం ప్రసాద్‌, సంగెపు రంగారావు, పీతా గోపీచంద్‌ పేర్కొన్నారు. మంగళవారం పోరంకి టీడీపీ కార్యాలయంలో దివంగత బీసీ నేత జ్యోతీరావు ఫూలే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు పూలే బీసీల కోసం చేసిన సేవలను గుర్తు చేశారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ జ్యోతిరావు ఫూలేను ఆదర్శంగా తీసుకొని మహిళలకు ఆస్తి హక్కులో సమాన వాటాను కల్పించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు అనుమోలు ప్రభాకరరావు, బొర్రా వెంకట్‌, విక్రమ్‌, షేక్‌ సలీం, తాడిశెట్టి వీరాస్వామి, కోసూరు రమేష్‌, సుంకర రమేష్‌, సుభాని, మన్నే వాసు తదితరులు పాల్గొన్నారు. ఉయ్యూరు : సమసమాజ స్థాపన, అణగారిన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, విద్యాభివృద్ధికోసం క ృషి చేసిన జ్యోతిరావు ఫూలే గొప్ప సంఘ సంస్కర్త అని టీడీపీ మండల అధ్యక్షుడు యెనిగళ్ల కుటుంబరావు, లచ్చన్న సేవాసమితి అధ్యక్షుడు కాగిత కొండ కీర్తించారు. జ్యోతిరావు ఫూలే వర్ధంతి పురస్క రించుకుని సర్దార్‌ గౌతులచ్చన్న సేవాసమితి అధ్యక్షుడు కాగిత కొండ ఆధ్వర్యలో మంగళవారం పూలే చిత్రపటానికి పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు. పామర్తి శివ, శివాజీ, బాబి పాల్గొన్నారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో పినమల నాగ కుమార్‌ ఆధ్వర్యంలో జ్యోతిరావుఫూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివా ళులర్పించారు. ఎంజీ రవి, గ్రంథాలయాధికారి రమణి పాల్గొన్నారు. ఉంగుటూరు : అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమసమాజ స్ధాపనకు ఎన్నో పోరాటాలు చేసిన యోధుడు మహాత్మా జ్యోతీరావు పూలే చిరస్మరణీయుడని ఎంపీడీవో జీఎస్‌వీ శేషగిరిరావు అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో మహాత్మా జ్మోతీరావు ఫూలే వర్ధంతిని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ టి.వినీల, ఏపీఎం. ఎం.సాంబశివరావు, ఉపాధిహామీ పథకం ఫీల్డ్‌అసిస్టెంట్లు, సచివాలయ సిబ్బంది, మండల పరిషత్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:47:18+05:30 IST