Share News

Fiber Grid Case: చంద్రబాబు సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీ నిర్ణయం

ABN , First Publish Date - 2023-11-02T09:28:19+05:30 IST

అమరావతి: ఫైబర్ గ్రిడ్ కేసులో సీఐడీ అధికారులుు దూకుడు పెంచారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌ చేయడానికి నిర్ణయించారు. ఏడు స్థిరాస్తులను అటాచ్‌ చేయాలని సీఐడీ అధికారుల ప్రతిపాదనకు హోంశాఖ ఆమోదం తెలిపింది.

 Fiber Grid Case: చంద్రబాబు సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీ నిర్ణయం

అమరావతి: ఫైబర్ గ్రిడ్ కేసు (Fiber Grid Case)లో సీఐడీ అధికారులు (CID Officers) దూకుడు పెంచారు. టీడీపీ అధినేత (TDP Chief) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌ చేయడానికి నిర్ణయించారు. ఏడు స్థిరాస్తులను అటాచ్‌ చేయాలని సీఐడీ అధికారుల ప్రతిపాదనకు హోంశాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఏసీబీ కోర్టు (ACB Court) అనుమతి కోసం గురువారం అధికారులు పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. టెరాసాఫ్ట్‌ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్‌ చేయాలన్న సీఐడీ ప్రతిపాదనకు రాష్ట్ర హోంశాఖ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అటాచ్‌ ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి తదితర ఆస్తుల అటాచ్‌మెంట్‌కు హోంశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో ఆ స్థిరాస్తులను అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని కోరుతూ సీఐడీ అధికారులు ఇవాళ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు. ఈ కేసులో నిందితుడు కనుమూరి కోటేశ్వరరావు పేరిట గుంటూరులో 797 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఇంటి స్థలం ఉంది.

నిందితుడు కనుమూరి కోటేశ్వరరావు డైరెక్టర్‌గా ఉన్న నెప్‌టాప్స్‌ ఫైబర్‌ సొల్యూషన్స్‌కు చెందిన విశాఖపట్నం కిర్లంపూడి లేఅవుట్‌లోని ఓ ఫ్లాట్‌, టెరాసాఫ్ట్‌ కంపెనీ ఎండీ టి.గోపీచంద్‌ పేరిట హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఫ్లాట్‌, శ్రీనగర్‌ కాలనీలో ఉన్న మరో ఫ్లాట్‌.. అలాగే ఈ కేసులో నిందితుడు తుమ్మల గోపీచంద్‌ పేరిట హైదరాబాద్‌ యూసఫ్‌గూడలో ఉన్న ఫ్లాట్‌, గోపీచంద్‌ భార్య పవనదేవి పేరిట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో వ్యవసాయ భూమి ఉంది. వారి స్థిరాస్తులను అటాచ్‌ చేయడానికి రాష్ట్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది.

Updated Date - 2023-11-02T09:28:19+05:30 IST