Home » CID
స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్ట్ చేయడం వెనుక పెద్దకుట్ర జరిగిందని సీనియర్ ఐఏఎస్, నాటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్ స్పష్టం చేశారు.
అక్రమ కేసుల గురించి చాలాసార్లు వినుంటారు! ఏ తప్పూ చేయని వ్యక్తిని రాజకీయ కక్షసాధింపుతో అరెస్ట్ చేయడానికి ఏకంగా వాంగ్మూలాన్ని తారుమారు చేయడం గురించి విన్నారా?
Andhrapradesh: ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో సీఐడీ విచారణ ప్రారంభమైంది. జెత్వానీ, ఆమె తల్లిదండ్రులు ఈరోజు విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఈకేసును సీఐడీ అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
గుంటూరు జిల్లా: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి.. అలాగే ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ కేసుల విచారణ వేగవంతం కోసం సీఐడీకి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. సోమవారం మంగళగిరి డీఎస్పీ సీఐడీకి విచారణ పైళ్లు అప్పగించనున్నారు.
మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్‌కు గురి చేసిన కేసులో విశ్రాంత సీఐడీ అదనపు ఎస్పీ, ఆ కేసులో విచారణ అధికారి విజయ్‌పాల్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట హాజరయ్యారు. శుక్రవారం సాయంత్రం 4.15 గంటలకు ఆయన గుంటూరులోని వెస్ట్ డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు.
మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దహనం కేసులో సీఐడీ అధికారులు రెండోరోజు మంగళవారం కూడా విచారణ కొనసాగించారు. సోమవారం రాత్రి సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఆఽధ్వర్యంలో సీఐడీ అధికారులు సబ్‌కలెక్టరేట్‌లో విచారణ చేశారు.
వైద్యం చేయకుండానే ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) సొమ్ము స్వాహా చేశారన్న ఆరోపణలపై మొత్తం 30 ఆస్పత్రులపై సీఐడీ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సూత్రధారి, ఏపీ బేవరేజేస్ కార్పొరేషన్ మాజీ ఎండీ డి.వాసుదేవరెడ్డిని సీఐడీ అధికారులు పిలిపించి విచారించారు.
ఇసుక తవ్వకాలు, మైనింగ్ అనుమతులు, టెండర్ల ఒప్పందాలు అన్నింటా అక్రమాలకు కేంద్ర బిందువైన గనుల శాఖ మాజీ డైరెక్టర్, ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి కోసం సీఐడీ విస్తృతంగా గాలిస్తోంది.
మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసు సీఐడీకి అప్పగించింది. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు డీజీపీ ద్వారకా తిరుమలరావు (DGP Dwaraka Tirumala Rao) జారీ చేశారు. రెండ్రోజుల్లో కేసు మొత్తాన్ని సీఐడీకి మదనపల్లె పోలీసులు అప్పగించనున్నారు.