Share News

జ్యోతిరావు ఫూలే బోధనలు స్ఫూర్తిదాయకం

ABN , First Publish Date - 2023-11-29T00:40:11+05:30 IST

: మహాత్మా జ్యోతిరావు ఫూలే బోధనలు అందరికీ స్ఫూర్తిదాయకమని మాజీ ఎంపీ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు.

జ్యోతిరావు ఫూలే బోధనలు స్ఫూర్తిదాయకం

మచిలీపట్నం టౌన్‌, నవంబరు 28 : మహాత్మా జ్యోతిరావు ఫూలే బోధనలు అందరికీ స్ఫూర్తిదాయకమని మాజీ ఎంపీ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. వలందపాలెంలో జ్యోతిరావు ఫూలే విగ్రహానికి మంగళవారం కొనకళ్ల నారాయణరావు, పెడన నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌, పామర్రు నియోజక వర్గ ఇన్‌చార్జి వర్ల కుమారరాజా, జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, టీడీపీ నాయకులు యశ్వంత్‌ వర్మ, ఎండీ ఇలియాస్‌ బాషా, ముంతా సురేంద్ర కుమార్‌, అక్కుమహంతి రాజా, లంకే శేషగిరిరావు, పిప్పళ్ళ కాంతారావు, లంకే శేషగిరిరావు, బత్తిన దాసు, శివకోటి రాజేంద్ర ప్రసాద్‌, బాలాజీ , వాలిశెట్టి హైమవతి, లంకిశెట్టి నీరజ తదితరులు నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు విద్యావంతులయినప్పుడే ప్రగతిని సాధించగలుగుతారని ఫూలే పేర్కొన్నారన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి షాహిద్‌ బాబు, జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శేకుబోయి న సుబ్రహ్మణ్యం తదితరులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుడివాడ : టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళులర్పించారు. గోవాడ శివ, కాకరాల సురేష్‌, శొంఠి రామకృష్ణ, కంచర్ల సుధాకర్‌, పులవర్తి డేవిడ్‌, ఆర్నేపల్లి పాండు, రెడ్డి షణ్ముఖ్‌, కొల్లి రమ్య, పొట్లూరి రమాదేవి, దారపురెడ్డి శేషు, కోలవెన్ను గోపాలకృష్ణ, పట్టపు చిన్నా పాల్గొన్నారు. వెనిగండ్ల రాము వ్యక్తిగత కార్యాలయంలో జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి గుత్తా చంటి, బొంబాయి శ్రీను, మోజెస్‌, మిక్కిలినేని రమేష్‌, దువరపల్లి కోటి, సూరగాని సూరిబాబు, కఠారి రాంబాబు తదితరులు నివాళులర్పించారు. వైసీపీ కార్యాలయంలో నాయకులు గొర్ల శ్రీను, రామకృష్ణ, సైమన్‌, వెంకటలక్ష్మీ, రాజేష్‌, శేఖర్‌ తదితరులు నివాళులర్పించారు. ముగ్గుబజారు రోడ్డులో ఫూలే విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు మల్లేశ్వరరావు, నరసింహారావు, శేషుబాబు, శ్రీను, గోవర్ధనరావు, రాధాకృష్ణ, రంగారావు తదితరులు నివాళులర్పించారు. పామర్రు : వైసీపీ కార్యాలయంలో మాజీ జడ్పీటీసీ సభ్యురాలు కైలే జ్జానమణి తదితరులు పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. పెదపారుపూడి : తహసీల్దార్‌ వి.నాగభూషణం ఆధ్వర్యంలో మంగళవారం జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి నివాళులర్పించారు. ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ వాణి, రీ సర్వే డీటీ సుందరరావు, ఆర్‌ఐ రవికుమార్‌, గుడివాడ డివిజన్‌ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు చాట్ల అజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అవనిగడ్డ : గాంధీక్షేత్రంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్ధంతి నిర్వహించారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. టీడీపీ నాయకులు కొల్లూరి వెంకటేశ్వరరావు, యాసం చిట్టిబాబు, మాచవరపు ఆదినారాయణ, దిరిశం బాలకోటయ్య, బండే రాఘవ, ఘంటసా రాజమోహనరావు, బచ్చు రఘునాథ్‌, కూనపరెడ్డి చంద్రశేఖర్‌, మెగావత్‌ గోపి, విశ్వనాథుని మురళీ, మండలి రామ్మోహనరావు, యలవర్తి ఆది, మేడికొండ విజయ్‌, గుం టూరు వినయ్‌, కొట్టే విజయ్‌, పులిగడ్డ నాంచారయ్య, కొండవీటి పాండురంగారావు, పరిమిశెట్టి శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. నాగాయలంక : విద్యా ప్రదాత జ్యోతిరావు ఫూలే అని వక్తలు నివాళులర్పించారు. మత్స్యకార భవనం వద్ద సంప్రదాయ మత్స్యకారుల సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మహాత్మ జ్యోతిరావు పూలే వర్థంతి కార్యక్రమం జరిగింది. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లకనం నాగాంజనేయులు, కర్రి కృష్ణమూర్తి, నాగిడి పోతురాజు, సైకం విజయ భాస్కర్‌, కొల్లు సత్యనారాయణ, తానంకి పోతురాజు, సైకం వెంకట కృష్ణ తదితరులు పూలే చిత్రపటానికి నివాళులర్పించారు.

Updated Date - 2023-11-29T00:40:12+05:30 IST