Share News

బడుగుల విద్యాభివృద్ధికి ఫూలే కృషి

ABN , First Publish Date - 2023-11-29T00:28:41+05:30 IST

సామాజిక అసమానతలపై పోరాటం సాగించడంతో పాటుగా బడుగువర్గాల్లో విద్యాభివృద్ధికోసం మహాత్మా జ్యోతిరావు ఫూలే అవిశ్రాంత కృషి చేశారని పలువురు పేర్కొన్నారు.

బడుగుల విద్యాభివృద్ధికి ఫూలే కృషి
జగ్గయ్యపేటలో ఫూలేకు నివాళులర్పిస్తున్న శ్రీరాం తాతయ్య తదితరులు

తిరువూరు, నవంబరు 28: సామాజిక అసమానతలపై పోరాటం సాగించడంతో పాటుగా బడుగువర్గాల్లో విద్యాభివృద్ధికోసం మహాత్మా జ్యోతిరావు ఫూలే అవిశ్రాంత కృషి చేశారని పలువురు పేర్కొన్నారు. టీడీపీ, కార్యాలయంలో మంగళవారం ఫూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొమ్మసాని మహేష్‌, సింధు శ్రీను, డాక్టర్‌ జయసింహా, ఇమ్మడి రవి, పర్వతం శ్రీనివాసరావు, మీనుగు శ్రీనివాసరావు, పంది శ్రీనివాసరావు, శ్యామ్‌, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి పూలమాల వేసి నివాళి అర్పించారు. సమాజానికి ఆయనందించిన సేవల్ని వివరించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గత్తం కస్తూరిబాయి, కౌన్సిలరు శ్రీనివాసరావు(బీరువాలబాబు), జడ్పీటీసీ యరమల రామచంద్రారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ శీలం నాగనర్సిరెడ్డి పాల్గొన్నారు.

జగ్గయ్యపేట: స్త్రీ విద్యావ్యాప్తికి, బీసీల అభ్యున్నతికి తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతీరావుఫూలే అని మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, మునిసిపల్‌ చైర్మన్‌ రంగాపురం రాఘవేంద్ర, జిల్లా బీసీ మహిళా సంక్షేమసంఘం అధ్యక్షురాలు కన్నెబోయిన రామలక్ష్మి, బీఎస్పీ రాష్ట్ర నేత కొదమల ప్రభుదాస్‌ అన్నారు. వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. కార్యక్రమాల్లో టీడీపీ నేతలు మేకా వెంకటేశ్వర్లు, పేరం సైదేశ్వరరావు, వైసీపీ నేతలు కాశీకిశోర్‌, బద్దూనాయక్‌, గోగుల వెంకన్న పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:28:42+05:30 IST