Share News

సైకో జగన్‌ను సాగనంపాలి

ABN , First Publish Date - 2023-11-29T00:44:53+05:30 IST

వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సైకో జగన్‌ను ఇంటికి సాగనంపాలని టీడీపీ సీనియర్‌ నాయకులు వెలగపూడి శంకరబాబు, తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర మండిపడ్డారు.

 సైకో జగన్‌ను సాగనంపాలి
కానూరు 31వ వార్డు, తులసీనగర్‌లో జరిగిన బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకుడు వెలగపూడి శంకరబాబు

పెనమలూరు, నవంబరు 28 : వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సైకో జగన్‌ను ఇంటికి సాగనంపాలని టీడీపీ సీనియర్‌ నాయకులు వెలగపూడి శంకరబాబు, తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర మండిపడ్డారు. మంగళవారం కానూరు 31వ వార్డు, తులసీనగర్‌లో జరిగిన బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొని స్థానిక నాయకులతో కలిసి ప్రజలతో మాట్లాడారు. జగన్‌ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కక్షతో వ్యవహరించడం తప్ప రాష్ట్ర ప్రజలను ఉద్దరించిందేమీలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు సైకో ను ఓడించి చంద్రబాబుకు పట్టం కట్టి రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇక్బాల్‌, రమేష్‌, వెంకటేశ్వరరావు, బాషా, ఇనయతుల్లా, రఫీ తదితరులు పాల్గొన్నారు.

అంతిమ విజయం న్యాయానిదే..

కంకిపాడు: అంతిమ విజయం న్యాయానిదే అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయం లో రుజువు అయిందని టీడీపీ సీనియర్‌ నాయకులు తుమ్మలపల్లి హరికృష్ణ అన్నారు. కంకిపాడులోని 173వ బూత్‌లో మంగళవారం నిర్వహించిన బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సుప్రీం కోర్టులో చంద్రబాబు నాయుడుకు ఊరట లభించటం ఆనం దంగా ఉందన్నారు. సీఐడీ అధికారులు మాత్రం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నా యుడు ప్రవేశ పెట్టిన మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతం గా తీసుకువెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు గోగినేని వెంకరమణ, కొండా నాగేశ్వ రరావు, పులి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

180వ బూత్‌లో నిర్వహించిన బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు జువ్వా రామకృష్ణ, మాజీ ఎంపీపీ దేవినేని రాజా, టీడీపీ సీనియర్‌ నాయకులు తుమ్మలపల్లి హరికృష్ణ, టీడీపీ బీసీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షులు సెంగెపు రంగారావు, నాయకులు పులి శ్రీనివాసరావు, వణుకూరు విక్రం, కొండా నాగేశ్వరరావు, చలవాది రాజ, బొర్రా వెంకట్‌, గోగినేని వెంకటరమణ, ఎస్‌కే బాజీ, మురళి. సలీం, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:44:55+05:30 IST