Share News

మైనారిటీ ఓట్లు అడిగే హక్కు టీడీపీకే ఉంది

ABN , First Publish Date - 2023-11-29T00:29:06+05:30 IST

రాష్ట్రంలో మైనారిటీ ఓట్లు అడిగే హక్కు ఒక్క టీడీపీకే ఉందని పొలిట్‌బ్యూరో సభ్యుడు, శాసనమండలి మాజీ చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌, ఎన్టీఆర్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ అన్నారు. టీడీపీ లౌకిక పార్టీ, మత సామర్యస్యాన్ని కాపాడే పార్టీ అని చెప్పారు. మంగళవారం ఆటోనగర్‌లోని జిల్లా కార్యాలయంలో ఉమ్మడి కృష్ణాజిల్లా ముస్లిం నాయకుల అవగాహన సదస్సు జరిగింది

మైనారిటీ ఓట్లు అడిగే హక్కు టీడీపీకే ఉంది
సమావేశంలో మాట్లాడుతున్న నెట్టెం రఘురామ్‌

విద్యాధరపురం, నవంబరు 28 : రాష్ట్రంలో మైనారిటీ ఓట్లు అడిగే హక్కు ఒక్క టీడీపీకే ఉందని పొలిట్‌బ్యూరో సభ్యుడు, శాసనమండలి మాజీ చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌, ఎన్టీఆర్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ అన్నారు. టీడీపీ లౌకిక పార్టీ, మత సామర్యస్యాన్ని కాపాడే పార్టీ అని చెప్పారు. మంగళవారం ఆటోనగర్‌లోని జిల్లా కార్యాలయంలో ఉమ్మడి కృష్ణాజిల్లా ముస్లిం నాయకుల అవగాహన సదస్సు జరిగింది. ఉమ్మడి జిల్లాల మైనారిటీ అధ్యక్షులు షేక్‌ కరీముల్లా, సయ్యద్‌ ఖాజాల అధ్యక్షతన జరిగిన సదస్సులో ఎంఏ షరీఫ్‌ పాల్గొని ప్రసంగించారు. వచ్చే ఎన్నికలలో టీడీపీకి మైనారిటీ ముస్లిం సోదరులందరు సహకారాన్ని అందించాలన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. చంద్రబాబు హయాంలో ఎక్కడా ముస్లింల మాన, ప్రాణ ఆస్తులపై దాడులు జరగలేదన్నారు. ప్రస్తుతం ముస్లింలు ఐక్యం కావాల్సిన అవసరముందనిచెప్పారు. ఏపీలో 10-12 శాతం ఉన్న ముస్లింలందరూ సంఘటితమై టీడీపీకి ఓటు వేయాలని కోరారు. ఎన్టీఆర్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ మాట్లాడుతూ, జగన్‌రెడ్డి ప్రభుత్వంలో ముస్లింలకు ఉపాధి దొరకడం లేదన్నారు. తీవ్ర అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌, రాష్ట్ర అధికార ప్రతినిధులు కె.నాగుల్‌మీరా, సయ్యద్‌ రఫీ, రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ ఫిరోజ్‌, పార్టీ సీనియర్‌ నాయకులు ఎంఎస్‌ బేగ్‌ ప్రసంగించారు. ఈ సమావేశంలో ముస్లిం మైనారిటీ నాయకులు ఫతావుల్లా, అమానుల్లా, కరీముల్లా, పైజామ్‌, ఆషా, ఎంఏ ఖాలీద్‌, షేక్‌ బాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:29:17+05:30 IST