Share News

అధికారుల నిర్లక్ష్యంతోనే లక్ష్మీపురంలో అతిసార

ABN , First Publish Date - 2023-11-28T23:40:50+05:30 IST

కర్నూలు కార్పొరేషన్‌ పరిధిలోని 28వ వార్డు లక్ష్మీపురంలో అధికారుల నిర్లక్ష్యంతోనే అతిసార ప్రబలిందని టీడీపీ పాణ్యం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారుల నిర్లక్ష్యంతోనే లక్ష్మీపురంలో అతిసార

బాధితులను పరామర్శించిన గౌరు చరిత

కల్లూరు, నవంబరు 28: కర్నూలు కార్పొరేషన్‌ పరిధిలోని 28వ వార్డు లక్ష్మీపురంలో అధికారుల నిర్లక్ష్యంతోనే అతిసార ప్రబలిందని టీడీపీ పాణ్యం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. హడావిడిగా లక్ష్మీపురం, పందిపాడు, దూపాడు గ్రామాలను విలీనం చేసిన అధికారులు వార్డు అభివృద్ధికి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని అన్నారు. హంద్రీ నదిలోని రింగ్‌బావి సమీపంలో డ్రైనేజీ వ్యర్థాలను డంప్‌ చేసి కనీసం క్లోరి నేషన్‌ చేయకుండా నేరుగా నీరు సరఫరా చేస్తూ ప్రజా ఆరోగ్యంతో చెలగా టమాడుతున్నరని అన్నారు. నగరపాలక సంస్థ వాటర్‌వర్స్క్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కలుషిత నీరుతాగి వాంతులు, విరేచ నాలతో ప్రభుత్వ ఆస్పత్రిలోలో చికిత్స పొందుతున్న బాధితులను గౌరు చరిత పరామర్శించారు. వీరికి మెరుగైన చికిత్స అందించాలని ఆస్పత్రి సూపరింటెం డెంట్‌ను కోరారు. మంగళవారం లక్ష్మీపురం బీసీ కాలనీలో ఆమె పర్యటించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు స్పందించి శుద్ధజలం సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆమె వెంట టీడీపీ నాయకులు చిన్న మారెన్న, పుల్లారెడ్డి ఉన్నారు.

బాధితులకు సీపీఎం నాయకుల పరామర్శ: కలుషిత నీరుతాగి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న 28వ వార్డు లక్ష్మీపురం గ్రామంలోని బాధితులను సీపీఎం నాయకులు పరామర్శించారు. మంగళవారం హంద్రీ నదిలోని బావిని, మురుగు నీటి నిల్వలను సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు జి.రామకృష్ణ బృంద సభ్యులతో కలిసి పరిశీలించారు. హంద్రీనదిలో పలు కళాశాలలు, పాఠశాలల నుంచి వ్యర్థాలు వదులుతున్నారని ఆరోపించారు. పీఎస్‌ రాదాకృష్ణ, నగేష్‌, గురుశేఖర్‌, కే.మధు, శ్రీనివాసులు, గోపి ఉన్నారు.

Updated Date - 2023-11-28T23:40:54+05:30 IST