Share News

అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే

ABN , First Publish Date - 2023-11-28T23:43:06+05:30 IST

అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని డీసీసీ అధ్యక్షుడు కే.బాబురావు అన్నారు.

అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే
కాంగ్రెస్‌ కార్యాలయంలో పూలే చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న నాయకులు

కర్నూలు(అర్బన్‌), నవంబరు 28: అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని డీసీసీ అధ్యక్షుడు కే.బాబురావు అన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప, సేవ దళ్‌ మహిళా అధ్యక్షురాలు ఏ. వెంక టసుజాత, జిల్లా అధ్యక్షురాలు ప్రమీల, ఐన్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు బీ. బతుకన్న, మైనార్టీ సెల్‌ సిటీ అధ్యక్షు రాలు షేక్‌ ఖాజా హుస్సేన్‌, మద్దమ్మ, ఎల్లమ్మ పాల్గొన్నారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మంగళవారం కర్నూలు నగరంలోని బీసీ సంక్షేమ సంఘం భవన్‌లో జాతీయ బీసీ సంక్షేమం జాతీయ కన్వీనర్‌ వై.నాగేశ్వరరావు, జాతీయ కార్యదర్శి నక్కల మిట్ట శ్రీనివాసులు బీసీ భవన్‌లో, బిర్లా కాం పౌండు సర్కిల్‌లో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నాగేశ్వర రావు యాదవ్‌ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా బీసీ వర్గాల్లో చైతన్యం పెలుబుకిన కారణంగానే అగ్రవర్గాలకు చెందిన వివిధ రాజకీయ నాయకులు బీసీల ఓట్ల కోసం కులగణన కార్యక్రమాన్ని చేపట్టాయన్నారు. బీసీల రాజ్యాధికారంతో పాటు వివిధ సంక్షేమ కార్యకమ్రాల అమలు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడిని పెంచేందుకు త్వరలోనే దేశ వ్యాప్తంగా రథయాత్ర చేపట్టబోతున్నామ న్నారు. బీసీలకు 13 ఎంపీ సీట్లు, 90 ఎమ్మెల్యే సీట్లు, అన్ని రాజకీయ పార్టీలు తప్పని సరిగా కేటాయించాలని, చట్టసబల్లో బీసీలకు 80 శాతం రిజర్వేషన్లు కల్పిం చాలని, జనాభా ప్రాతిపదికన అన్ని శాఖల్లో నిఽధులను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీసీ నాయకులు రాం బాబు, శేషఫణి, మురళీ మనోహర్‌, జయన్న, అన్వర్‌హుశేన్‌ పాల్గొన్నారు.

కర్నూలు(ఎడ్యుకేషన్‌): స్థానిక బీసీ భవన్‌ ప్రాంగణంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి డీబీసీ డబ్లూవో వెంకటలక్ష్మమ్మ మంగళవారం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు రాంబాబు, మోహన్‌, బీసీ సం ఘం నాయకులు కె.రామకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.

కర్నూలు(కలెక్టరేట్‌): మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీ యమని కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనందబాబు అన్నారు. మంగ ళవారం పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో యేసు రాజు, భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-28T23:43:07+05:30 IST