Share News

రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోని జగన్‌: టీడీపీ

ABN , First Publish Date - 2023-11-28T00:03:12+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోవడం లేదని టీడీపీ నాయకులు ఆరోపించారు.

రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోని జగన్‌: టీడీపీ
కోవెలకుంట్ల: కంపమల్లలో కరపత్రాలను పంపిణీ చేస్తున్న బీసీ

ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోవడం లేదని టీడీపీ నాయకులు ఆరోపించారు. ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ’లో భాగంగా సోమవారం నాయకులు వివిధ గ్రామాల్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో గురించి వివరించారు.

కోవెలకుంట్ల, నవంబరు 27: ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసానిరామిరెడ్డి విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఆరోపించారు.. మండలంలోని కంపమల్ల గ్రామంలో సోమవారం బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీసీ మాట్లాడుతూ గ్రామానికి కనెక్టింగ్‌ రహదారులు, సీసీ రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ కల్పించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారన్నారు. రహదారులు, విద్యుత్‌, నీటి సదూపాయాల కల్పనకు ఎంత భారీగా ఖర్చు పెడితే అంత ఎక్కువగా ఆర్థికంగా గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అయితే మౌలిక వసతులు కల్పించక ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. జగన్‌ పాలనలో పంటలకు గిట్టుబాటు ధరలు లేక, రసాయన ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటడంతో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని బీసీ ధ్వజమెత్తారు. కంపమల్ల గ్రామంలో టీడీపీ హయాంలో రూ.159 లక్షలతో అభివృద్ధి పనులు చేసినట్లు లెక్కలతో సహా వివరించారు. రూ.86 లక్షలు రుణమాఫీ, 5.5 లక్షల పొదుపు మహిళల రుణమాఫీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు కంపమళ్ల సుబ్బారెడ్డి, అమడాల మద్దిలేటి, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

చాగలమర్రి: వైసీపీ అరాచక పాలనకు ప్రజలే చరమగీతం పాడాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పిలుపునిచ్చారు. మండలంలోని చింతలచెరువు గ్రామంలో సోమవారం రాత్రి బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. టీడీపీ మ్యానిఫెస్టోను వివరించారు. అనంతరం గంగమ్మ ఆలయంలో పూజలు చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ మండల కన్వీనర్‌ నరసింహారెడ్డి, బీసీ సెల్‌ స్పోక్‌ పర్సన్‌ సల్లానాగరాజు, టీడీపీ నాయకులు నారాయణరెడ్డి, సర్పంచ్‌ మాధవి, టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి గుత్తి నరసింహులు, చిన్నకేశాల్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, బాలగుర్రప్ప, సంజీవరాయుడు, చంద్రశేఖర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, రామసుబ్బయ్య, ఈశ్వర్‌రెడ్డి, పాల షరీఫ్‌, చిన్నపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శిరివెళ్ల: రాష్ట్రంలోని పేదల సంక్షేమమే టీడీపీ ధ్యేయమని ఆ పార్టీ నాయకులు కమతం పుల్లారెడ్డి, కమతం లక్ష్మిరెడ్డి అన్నారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా యర్రగుంట్లలోని 115వ బూత్‌లో వారు పర్యటించి టీడీపీ మేనిఫెస్టో పత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలకు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పరాభవం తప్పదన్నారు. నాయకులు హుసేనప్ప, పక్కిరయ్య, ఓబులేసు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

బేతంచెర్ల: వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్షావలి చౌదరి, మండల ఉపాధ్యక్షుడు రామనాథం అన్నారు. మండలంలోని గోర్లగుట్ట, కొలుములపల్లె, పట్టణంలోని కొత్తపేటలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్ర మాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధి కారంలోకి వచ్చి రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపిం చారు. మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. గోర్లగుట్ట నాయకులు గోపాల్‌ రెడ్డి, పద్మనాభం, చంద్రయ్య, సత్యం, కొలుములపల్లె నాయకులు జగదీష్‌, బేతంచెర్ల కొత్తపల్లి, కొత్తపేటలో నిర్వహించిన కార్యక్రమంలో తిరుమలేష్‌ చౌదరి, ఉన్నం చంద్రశేఖర్‌, రామ్మూర్తి, నారాయణస్వామి, శ్రీరాములు, వంశీకృష్ణ, మధు లోకేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-11-28T00:03:13+05:30 IST