Share News

జ్యోతిరావు పూలే వర్ధంతి

ABN , First Publish Date - 2023-11-28T23:57:49+05:30 IST

పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ప్రజా వైద్యశాల మల్లికార్జున ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని నిర్వహించారు.

 జ్యోతిరావు పూలే వర్ధంతి
డోన్‌లో జ్యోతిరావు పూలే చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న ధర్మవరం సుబ్బారెడ్డి

డోన్‌, నవంబరు 28: పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ప్రజా వైద్యశాల మల్లికార్జున ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. టీడీపీ డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి, విద్యాభివృద్ధికి, సమసమాజ స్థాపనకు పోరాట యోధుడిగా మహాత్మా జ్యోతిరావు పూలే పని చేశారని అన్నారు. సంఘ సంస్కర్తగా పేరు గడించి సామాజిక న్యాయం కోసం పోరాడిన ధీరుడు అని కొనియాడారు. టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, అభిరెడ్డిపల్లె గోవిందు, ప్యాపిలి మండల అధ్యక్షుడు గండికోట రామసుబ్బయ్య, శ్రీరాములు, చక్రపాణిగౌడు, ఎస్‌.పి.సుంకన్న, నీలం ప్రభాకర్‌ పాల్గొన్నారు.

డోన్‌(రూరల్‌): మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏఈ నాగరాజు, కాంగ్రెస్‌ పార్లమెంటు నియోకవర్గ ప్రధాన కార్యదర్శి గార్లపాటి మద్దిలేటి పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం పట్టణంలో జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వారు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే జయంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు లక్ష్మీదేవి, మస్తాన్‌, వెంకట్రాముడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-28T23:57:50+05:30 IST