Share News

టీడీపీతోనే మహిళా సాధికారత

ABN , First Publish Date - 2023-11-29T00:00:20+05:30 IST

టీడీపీతోనే మహిళా సాధికారత సాధ్యమని ఆ పార్టీ నాయకులు అన్నారు.

టీడీపీతోనే మహిళా సాధికారత
సంజామల: ఆర్‌.లింగందిన్నెలో మహిళలకు కరపత్రాలు పంపిణీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి

టీడీపీతోనే మహిళా సాధికారత సాధ్యమని ఆ పార్టీ నాయకులు అన్నారు. ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఇంటింటికి తిరిగి మేనిఫెస్టో గురించి వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ హయాంలో మహిళలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు.

సంజామల, నవంబరు 28: అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని హమీ ఇచ్చిన జగన్‌ మద్యాన్నే ప్రధాన ఆదాయంగా మార్చుకున్నారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి ఆరోపించారు. ఆర్‌.లింగందిన్నె గ్రామంలో మంగళవారం జరిగిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో బీసీ పాల్గొన్నారు. మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఏర్పాటు అయిన ప్రజావేదికపై బీసీ మాట్లాడారు. జగన్‌ అండ్‌ కో గ్రామాల్లో వీధివీధిన బెల్టుషాపులు, నాటుసారా విక్రయించి ప్రజల సొమ్మును దండుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆయన అనుచరులు బెల్టుషాపులు, నాటుసారా విక్రయాలు జరిపిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమం గాలికి వదిలేసి కాటసాని నియంతలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఒక్క చాన్స్‌ అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆర్‌.లింగందిన్నె గ్రామాభివృద్ధికి రూ.114 లక్షలు వెచ్చించామన్నారు. రూ.93 లక్షలు టీడీపీ ప్రభుత్వం రుణమాఫీ చేసిందన్నారు. టీడీపీ మండల ఇన్‌చార్జి బత్తుల ప్రతాప్‌ రెడ్డి, కోడూరు పెద్దపుల్లయ్య, టీడీపీ మండల ఉపాఽధ్యక్షుడు మల్కి హుస్సేన్‌, నాయకులు బండి ప్రతాప్‌ రెడ్డి, భాస్కర్‌ యాదవ్‌, రామసుబ్బారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి, మద్దిలేటి, శివరామిరెడ్డి, రమణ రెడ్డి, శివయ్య, తదితరులు పాల్గొన్నారు.

అవుకు: అవుకు పట్టణంలో బుధవారం జరిగే బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి పాల్గొంటారని టీడీపీ నాయకులు వెంకటరమణ నాయక్‌, తిక్కన్న, దంతెల రమణ తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు.

బేతంచెర్ల: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అక్రమాలకు, అవినీతికి, దౌర్జన్యాలకు పాల్పడే నాయకుల బెదిరింపులకు భయపడవద్దని, అండగా టీడీపీ ఉంటుందని డోన్‌ టీడీపీ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. మండలంలోని హెచ్‌.కొట్టాల గ్రామంలో మంగళవారం టీడీపీ మండల కన్వీనర్‌ ఎల్లనాగయ్య అధ్యక్షతన బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజాసంక్షేమం విస్మరించి అక్రమాలకు, ఇసుక దందాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో డోన్‌ నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు కాటమయ్య, నాయకులు మురళీకృష్ణ, హరుణ్‌, మేకల నాగరాజు, రూబెన్‌, మహేష్‌; యోగేంద్రబాబు, యంగన్న, రామచంద్రారెడ్డి, నందీశ్వరుడు, తదితరులు పాల్గొన్నారు.

డోన్‌: టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తారని టీడీపీ నాయకులు ధర్మవరం పెద్దనాగిరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు సీఎం శ్రీనివాసులు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ప్రజావైద్యశాల మల్లికార్జున అన్నారు. మంగళవారం పట్టణంలోని ఇందిరానగర్‌లో టీడీపీ ఆద్వర్యంలో బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా వైద్యశాల మల్లికార్జున మాట్లాడుతూ వైసీపీ పాలనలో మహిళలకు తీరని అన్యాయం జరిగిందని మండిపడ్డారు. కార్యక్ర మంలో హుశేన్‌పీరా, మాబాషా, సురేష్‌, రమేష్‌, జయరాం, మదనగోపాల్‌ రెడ్డి, మాధవి, పెద్దయ్య పాల్గొన్నారు.

శిరివెళ్ల: ప్రజా సంక్షేమాన్ని విస్మరించి స్వార్థ రాజకీయాలు చేస్తున్న వైసీపీకి వచ్చే ఎన్నికల్లో పతనం తప్పదని టీడీపీ నాయకుడు కుందూరు మోహన్‌రెడ్డి అన్నారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీలో కార్యక్రమంలో భాగంగా మండలంలోని గుంప్రమాన్‌దిన్నె గ్రామంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ టీడీపీ మేనిఫెస్టో పత్రాలను పంపిణీ చేశారు. నాయకులు ప్రతాప్‌రెడ్డి, సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉయ్యాలవాడ: టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని టీడీపీ యువ నాయకుడు భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి అన్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తుడుమలదిన్నె గ్రామంలో పర్యటించారు. ఇంటింటికీ తిరిగి టీడీపీ పథకాల గురించి వివరించారు. ఆయన మాట్లాడుతూ వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు. టీడీపీ మండల కన్వీనర్‌ కూడాల నారాయణరెడ్డి, పేరెడ్డి మోహన్‌రెడ్డి, మారంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, అనంత రామసుబ్బారెడ్డి, బోరెడ్డి నర్శిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, గోపిరెడ్డి హరిప్రసాద్‌ రెడ్డి, పల్లె బాబుల్‌రెడ్డి, మద్దూరు క్రిష్ణారెడ్డి, చిట్టెపు రాజగోపాల్‌రెడ్డి, ఆకుల వెంకటసుబ్బయ్య, ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దొర్నిపాడు: వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ మండల నాయకుడు మల్లేశ్వరచౌదరి, మాజీ ఆలయ ధర్మకర్త లింగుట్ల వెంకట్‌నాయుడు అన్నారు. మంగళవారం మండలంలోని చాకరాజువేముల గ్రామంలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించి టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను అందజేశారు. గోపాల్‌నాయుడు, శేఖర్‌నాయుడు, డీలర్లు రమణయ్య, హబీబ్‌బాషా, మాజీ సర్పంచ్‌లు దస్తగిరి, నాగన్న, జాకీర్‌హుసేన్‌, నాగరాజు, సుబ్బరాయుడు, భూమా రుద్రారెడ్డి, బూషిరెడ్డి, ఐటీడీపీ శ్రీను తదితరులు ఉన్నారు.

బేతంచెర్ల: రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్షావలి చౌదరి సూచించారు. పట్టణంలోని కొత్తపేటలో మంగళవారం బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ మండల సమన్వయకర్త చంద్రశేఖర్‌, నారాయణ స్వామి, తెలుగు యువత అధ్యక్షుడు వంశీకృష్ణ, మధుసూదన్‌ రెడ్డి, రామాంజినేయులు, వంశీ, వేణుగోపాల్‌ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:00:22+05:30 IST