Google : గూగుల్ బెటరన్న కామెంట్స్‌పై మంత్రి సురేష్ మరోసారి ఇలా..?

ABN , First Publish Date - 2023-09-06T22:05:07+05:30 IST

గురుపూజోత్సవం రోజు (Teachers Day) గురువులపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ (Audimulapu Suresh) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన టీచర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..

Google : గూగుల్ బెటరన్న కామెంట్స్‌పై మంత్రి సురేష్ మరోసారి ఇలా..?

గురుపూజోత్సవం రోజు (Teachers Day) గురువులపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ (Audimulapu Suresh) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన టీచర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. గురువుల స్థానంలో ఇప్పుడు గూగుల్ (Google) వచ్చిందన్నారు. గూగుల్ వచ్చిన తర్వాత గురువులు అవసరం లేని పరిస్థితి ఏర్పడిందని మంత్రి సురేష్ వ్యాఖ్యానించారు. గురువుల కన్నా గూగుల్లో ఎక్కువ మెటీరియల్ లభిస్తోందని చెప్పారు. టీచర్లకు తెలియని ఎన్నో అంశాలు గూగుల్‌లో కొడితే తెలిసిపోతుందని మంత్రి అన్నారు. దీంతో టీచర్స్ డే కార్యక్రమంలోనే టీచర్లను మంత్రి సురేష్ ఘోరంగా అవమానించినట్లయ్యింది. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారంపై మరోసారి స్పందించి వివరణ ఇచ్చుకున్నారు.


Adimulapu-Suresh.jpg

నేను అనలేదే..?

గురువులు కన్నా గూగుల్ మేలు అని నేను అన్నట్లు వచ్చిన వార్తలను ఖండిస్తున్నాను. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని కొంతమంది గూగుల్ పైన ఆధారపడుతూ గురువులను మరిచిపోతున్నారనే ఉద్దేశంతో మాట్లాడాను. మా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిని నేను. గతంలో విద్యాశాఖ మంత్రిగా సీఎం జగన్ నాయకత్వంలో చేపట్టిన విద్యా సంస్కరణల్లో నా కృషి, ఉపాధ్యాయ సంఘాలతో నాకున్న సత్సంబంధాలు అందరికీ తెలుసు. వ్యక్తి గతంగా నాపై బురదజల్లుతున్నారు. నేను అనని మాటలను వక్రీకరించడం మంచిది కాదుఅని మంత్రి సురేష్ వివరణ ఇచ్చుకున్నారు.

google.jpg

తెలుసుకోండి మంత్రీ!

అయితే.. గురుపూజోత్సవం నాడు గురువును పూచికపుల్లతో సమానంగా తీసిపడేయటం ఏంటని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ప్రపంచంలో ఉపాధ్యాయులకు ఏది ప్రత్యామ్నాయం కాదన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికారు. గూగుల్‌కు కంటెంట్‌ అందించేదీ ఓ గురువే అనే సంగతి గమనించాలని మంత్రి కౌంటర్ల వర్షం కురిపించారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడా కూడా గూగుల్ చదువులు లేవని.. ప్రపంచంలోని అన్ని దేశాల్లో గురువులే చదువులు చెబుతున్నారని సోషల్ మీడియా వేదికగా మంత్రిని తిట్టిపోశారు.


ఇవి కూడా చదవండి


AP Politics : చంద్రబాబును అరెస్ట్ చేసే ఛాన్సే లేదు.. : బీజేపీ కీలక నేత


YSRCP Vs TDP : పులివెందులో వైఎస్ జగన్‌కు ఊహించని షాక్..



Updated Date - 2023-09-06T22:07:14+05:30 IST