Ramanayudu : టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు ఉచితంగా ఇవ్వనందుకు నిరసనగా..
ABN , First Publish Date - 2023-10-26T14:14:32+05:30 IST
పాలకొల్లులో పారిశుధ్య కార్మికులతో కలిసి వార్డుల్లో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పారిశుధ్య పనులు చేశారు. టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు ఉచితంగా ఇవ్వనందుకు నిరసనగా పారిశుధ్య పనులు చేయడం జరిగింది. పేదలకు టిడ్కో గృహాలను ఉచితంగా ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మోసం, దగా చేశారన్నారు.
పాలకొల్లు : పాలకొల్లులో పారిశుధ్య కార్మికులతో కలిసి వార్డుల్లో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పారిశుధ్య పనులు చేశారు. టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు ఉచితంగా ఇవ్వనందుకు నిరసనగా పారిశుధ్య పనులు చేయడం జరిగింది. పేదలకు టిడ్కో గృహాలను ఉచితంగా ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మోసం, దగా చేశారన్నారు. ‘‘సొంత ఇంటి కల తీరని మహిళల బాధలు, కష్టాలు ముఖ్యమంత్రి జగన్ కి తెలియాలనే ఉదయం ఇంటింటికి పేపర్ పంచడం, పారిశుధ్య పనులు వంటివి చేస్తూ నిరసన వ్యక్తపరుస్తున్నాను. గత ప్రభుత్వంలో 100 శాతం పూర్తయిన కొన్ని ఇళ్ళకే రంగులు వేసి ఇచ్చారు.గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహాలను 10 లక్షలకు 20 సంవత్సరాల పాటు తాకట్టు పెట్టే కార్యక్రమాన్ని జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. పాలకొల్లు పట్టణ వాసులకు పెద్దగరువు ప్రాంతంలో నిర్మించాల్సిన 640 టిడ్కో గృహాలను రద్దు చేసింది. పట్టణ నిరు పేదలకు 20 కిలోమీటర్ల దూరంలో కాజా గొప్పులో నివాసయోగ్యం కానీ నీటిలో పనికిరాని సెంటు పట్టాని ఇచ్చి మోసం,దగా చేసింది’’ అని రామానాయుడు అన్నారు.