Share News

Nellore Dist.: ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం కేసులో 6గురు నిందితుల అరెస్టు..

ABN , First Publish Date - 2023-10-29T08:43:00+05:30 IST

నెల్లూరు జిల్లా: కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్, అతని అనుచరులను పట్టుకోలేకపోతున్నారు. సుధీర్ ఇంటి వద్దకు వెళ్లి, ఇంట్లోకి వెళ్లలేక డీఎస్పీ, సీఐ, ఎస్ఐ, సుమారు 30 మంది పీసీలు వెనుదిరిగారు.

 Nellore Dist.: ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం కేసులో 6గురు నిందితుల అరెస్టు..

నెల్లూరు జిల్లా: కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్, అతని అనుచరులను పట్టుకోలేకపోతున్నారు. సుధీర్ ఇంటి వద్దకు వెళ్లి, ఇంట్లోకి వెళ్లలేక డీఎస్పీ, సీఐ, ఎస్ఐ, సుమారు 30 మంది పీసీలు వెనుదిరిగారు. హత్యాయత్నం జరిగిన మరుసటి రోజునే సుధీర్ ఇంట్లో ధూంధాంగా నిశ్చితార్ధ వేడుకలు జరిగాయి. చివరి నిముషంలో హాజరుకాకుండా ఓ ఐపీఎస్ అధికారి వెనుదిరిగారు. సుధీర్‌కు పలువురు వైసీపీ ప్రజా ప్రతినుధులు, పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలున్నాయి. గత ఏడాది సుధీర్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిధిగా బ్రదర్ అనిల్ కుమార్ హాజరయ్యారు.

నెల్లూరు జిల్లా, కావలిలో దారుణం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. రౌడీమూఖలు పెట్రేగిపోతున్నాయి. బైకు అడ్డంగా ఉండగా హారన్ మోగించారని ఆర్టీసీ డ్రైవర్లపై మూకుమ్మడిగా దాడి చేసి, హత్యాయత్నం చేశారు. జాతీయ రహాదారి నడిరోడ్డులో బస్సును కారుతో అడ్డగించి దాష్టీకం ప్రదర్శించారు. ఆర్డీసీ డ్రైవర్ బీఆర్ సింగ్‌ని రోడ్డుపై పడేసి కాళ్లతో తన్నతూ రౌడీలు రెచ్చిపోయారు. అడ్డొచ్చిన వారిని, వీడియోలు తీయబోయిన వారిపైనా దాడి చేసి.. చంపి పాతిపెడతామంటూ హెచ్చరించారు. ఎవరొస్తారంటూ తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. ఈ ఘటనలో దేవరకొండ సుధీర్‌తో పాటు పది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల అరెస్టులో జాప్యం జరిగింది. దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Updated Date - 2023-10-29T08:43:00+05:30 IST