Share News

ఎన్నికల వేళ గుర్తుకొచ్చే..!

ABN , First Publish Date - 2023-11-28T22:50:09+05:30 IST

-ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు పొందేందుకే వైసీపీ ప్రభుత్వానికి అకస్మాత్తుగా కారిడార్‌ ప్రాంతం గుర్తొచ్చిందని, అందులోని భాగంగానే రెండురోజులుగా ఉన్నతాధికారులు హడావుడి చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారం చేపట్టి నాలుగున్నరేళ్లయినా దొనకొండలో పరిశ్రమల ఏర్పాటు, ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోని పాలకులు ఇప్పుడొచ్చి భూములు పరిశీలించడం వల్ల ప్రయోజనం లేదని చర్చించుకుంటున్నారు. రాజధానిని విశాఖకు తరలిస్తున్న క్రమంలో ఈ ప్రాంతం ప్రజలను మభ్యపెట్టి వైసీపీపై నమ్మకం కల్గించేందుకు పరిశ్రమల పేరుతో అధికారులతో హంగామా చేస్తున్నారే తప్ప మరేమి లేదని అంటున్నారు. నాలుగున్నరేళ్లుగా లేని అభివృద్ధి నాలుగు నెలల్లో ఏం చేస్తారని పెదవి విరుస్తున్నారు.

ఎన్నికల వేళ గుర్తుకొచ్చే..!
పామూరు ప్రాంతంలో మంగళవారం నిమ్జ్‌ భూములను పరిశీలిస్తున్న రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌

దొనకొండ కారిడార్‌, నిమ్జ్‌ భూములను పరిశీలించిన రాష్ట్ర ఉన్నతాధికారులు

టీడీపీ కాలంలో కీలక ప్రక్రియ పూర్తి

వైసీపీ వచ్చాక పట్టించుకోని దుస్థితి

ప్రస్తుత హంగామాపై ప్రజల్లో విమర్శలు

ఎన్నికల్లో లబ్ధికోసమేనని చర్చ

- గతంలో దొనకొండలో పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం ఎంపిక చేసిన భూములను రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్‌, అధికారులు సోమవారం పరిశీలించారు. దొనకొండలోని బాదాపురం, రుద్రసముద్రం, రాగమక్కపల్లి రెవెన్యూ పరిధిలో ఎంపికచేసిన భూములకు నేషనల్‌ హైవే, రైల్వేస్టేషన్‌, విద్యుత్‌, వాటర్‌ తదితర మౌలిక సౌకర్యాలు ఎంత దూరంలో అందుబాటులో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పామూరు మండలంలోని మార్కొండాపురం వద్ద నిమ్జ్‌ కోసం కేటాయించిన భూములను పరిశీలించారు.

- పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం గత ప్రభుత్వంలో దొనకొండ ప్రాంతంలో ఎంపిక చేసిన భూములను భారత్‌ పెట్రోలియం లిమిటెడ్‌ సంస్థ ప్రతినిధులు, రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్‌, ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం సందర్శించారు. రుద్రసముద్రం, బాదాపురం, ఇండ్లచెరువు, రాగమక్కపల్లి తదితర రెవెన్యూ గ్రామాల పరిధిలో ఎంపిక చేసిన మొత్తం ఎనిమిది వేల ఎకరాలకు సంబంధించిన భూమిలోని సౌకర్యాలను పరిశీలించారు.

-ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు పొందేందుకే వైసీపీ ప్రభుత్వానికి అకస్మాత్తుగా కారిడార్‌ ప్రాంతం గుర్తొచ్చిందని, అందులోని భాగంగానే రెండురోజులుగా ఉన్నతాధికారులు హడావుడి చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారం చేపట్టి నాలుగున్నరేళ్లయినా దొనకొండలో పరిశ్రమల ఏర్పాటు, ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోని పాలకులు ఇప్పుడొచ్చి భూములు పరిశీలించడం వల్ల ప్రయోజనం లేదని చర్చించుకుంటున్నారు. రాజధానిని విశాఖకు తరలిస్తున్న క్రమంలో ఈ ప్రాంతం ప్రజలను మభ్యపెట్టి వైసీపీపై నమ్మకం కల్గించేందుకు పరిశ్రమల పేరుతో అధికారులతో హంగామా చేస్తున్నారే తప్ప మరేమి లేదని అంటున్నారు. నాలుగున్నరేళ్లుగా లేని అభివృద్ధి నాలుగు నెలల్లో ఏం చేస్తారని పెదవి విరుస్తున్నారు.

ఒంగోలు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): నాలుగున్నరేళ్లుగా పట్టించుకోని పారిశ్రామికాభివృద్ధిపై ప్రభు త్వం ఇప్పుడు హడావుడి చేస్తోంది. జిల్లాలోని రెండు కీలకమైన పారిశ్రామికవాడలను రాష్ట్రప్రభుత్వ ఉన్నతాధికారులు సోమ, మంగళవారాల్లో సందర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ప్రతిపాదిత పారిశ్రామికాభివృద్ధి ప్రాంతాలైన దొనకొండ కారిడార్‌, నిమ్జ్‌ గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది దొనకొండ కారిడార్‌పై కొంత హడావుడి చేసినా అనంతరం వదిలేశారు. మరి కొద్దినెలలో ఎన్నికలు జరగనున్న సమయంలో ప్రభుత్వానికి అవి గుర్తుకొచ్చినట్లు కనిపిస్తోంది. తదనుగుణంగా పరిశ్రమల శాఖ ఉ న్నతాధికారులు సో మ, మం గళవారా ల్లో ఆ ప్రాం తాల ను సందర్శించారు. అక్కడ భూముల పరిశీలనతో పాటు రవాణా, నీరు ఇతర మౌలిక సౌకర్యాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల వేళ ప్రభుత్వ హడావుడి, అధికారుల పర్యటనలపై స్థానిక ప్రజానీకం పెదవి విరుస్తున్నారు.

నిమ్జ్‌కు సకల ఏర్పాట్లు

2012లో కేంద్రం కనిగిరి ప్రాంతం లో నిమ్జ్‌ను మంజూరు చేయగా పామూ రు, పీసీపల్లి మండలాల్లో భూముల గుర్తింపు, సర్వే, ఫెన్సింగ్‌ల ఏర్పాటు ఇతరత్రా పనులను నాడు టీడీపీ ప్రభు త్వం చేపట్టింది. అప్పట్లో ప్రతినెలా ఉన్నతాధికారుల పర్యటనలు, సమీక్ష లు, స్వదేశీ, విదేశీ కంపెనీల ప్రతినిధుల రాకపోకలు సాగుతూ పారిశ్రామిక అభివృద్ధిపై ప్రజల్లో విశ్వాసం కలిగింది. తద్వారా ఉపాధి లభిస్తుందన్న నమ్మకం యువతలోనూ పెరిగింది. ఇలాంటి సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. తొలి ఏడాది దొనకొండ కారిడార్‌పై హడావుడి చేసింది. విద్యుత్‌ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. తర్వాత మూడున్నరేళ్లుగా పారిశ్రామిక అభివృద్ధి విషయాన్ని గాలికి వదిలేసింది. నిజానికి ఈ రెండుచోట్ల పరిశ్రమల ఏర్పాటుకు టీడీపీ ప్రభు త్వం చేసిన కృషిని ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కొనసాగించి ఉంటే ఈ సమయానికి అనేక పరిశ్రమల ఏర్పాటయ్యేవి. మొత్తంగా లక్ష కుటుంబాలకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లక్ష్యంతో వీటిని ప్రతిపాదించగా కనీసం మూడవ వంతు అయినా ఈ పాటికి ఉపాధి అవకాశాలు అందేవి.

హడావుడి చేసి వదిలేశారు

తొలి ఏడాది హడావుడి చేసిన వైసీపీ ప్రభుత్వం అనంతరం పట్టించుకోలేదు. దీంతో ప్రతిపాదిత ప్రాంత భూములు నిరుపయోగంగా మిగిలిపోయాయి. అలా మూడున్నరేళ్లుగా నిర్లిప్తంగా ఉండటంతో అటు పారిశ్రామిక ప్రగతి, ఉపాధిపై ప్రజల్లో విశ్వాసం పోగా భూములు, స్థలాలు ధరలు పడిపోవడమే కాక కొనేవారు లేక యజమానులు నష్టపోయారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై అన్ని వర్గాలలో అసంతృప్తులు, విమర్శలు వస్తున్నాయి.

టీడీపీ హయాంలో అంతా సిద్ధం

పారిశ్రామికంగా చెప్పుకోదగిన అభివృద్ధి జిల్లాలో లేకపోవడంతో గత టీడీపీ ప్రభుత్వం దొనకొండ ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. విస్తారంగా ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు అందుబాటులో ఉండటంతోపాటు అక్కడ బ్రిటిష్‌ కాలం నాటి ఎయిర్‌పోర్ట్‌, రైల్వే లైన్‌ ప్రతిపాదిత అమరావతి అనంతపురం రోడ్డు అక్కడికి సమీపంలో పోనుండటం వంటి అంశాలతో అప్పటికే రాష్ట్ర రాజధానిగా కూడా దొనకొండ అనుకూలం అన్న ప్రచారం రావడంతో నాటి సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టిసారించారు. ఆ రకంగా పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు ప్రకటన రాగా పరిసర ప్రాంతాల్లోని 21 గ్రామాల్లో సుమారు 25వేల ఎకరాల భూములను ఇందుకోసం గుర్తించారు. భూసేకరణ ప్రక్రియ కొనసాగింది. కొన్ని గ్రేజింగ్‌, ప్రభుత్వ భూములను ఏపీఐఐసీకి బదలాయింపు చేశారు. రక్షణరంగంతోపాటు లాజిస్టిక్‌కు చెందిన పలు విదేశీ, స్వదేఽశీ కంపెనీల ప్రతినిధులు కూడా వచ్చి భూములు పరిశీలన చేసి పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చారు. ప్రభుత్వం కూడా మౌలిక సదుపాయాలపై దృష్టిసారించింది. నీరు ప్రధానం కాగా తొలుత సమీపంలోని ఎన్నెస్పీ కాలువ నుంచి అనంతరం శాశ్వతంగా వెలిగొండ ప్రాజెక్టు నుంచి తీసుకునేలా ప్రతిపాదించారు. అలాగే భూములులోనే రెండు ఎంఎ్‌సఎంఈ పోర్టులను కూడా మంజూరు చేసి సౌకర్యాలు కల్పించారు.

ఎన్నికలొస్తున్నాయని...

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వం హడావుడి చేస్తోంది. క్షేత్రస్థాయి పరిస్థితులు, సౌకర్యాల పరిశీలన పేరుతో ఉన్నతాధికారులు ఆ ప్రాంతాలకు వస్తున్నారు. రాష్ట్ర పరిశ్రమల కార్యదర్శి యువరాజ్‌, కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ ఇతర అధికారులతో కలిసి సోమవారం దొనకొండ కారిడార్‌, నిమ్జ్‌ ప్రాంతాలను సందర్శించారు. అలాగే మంగళవారం పరిశ్రమల శాఖ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ కారిడార్‌ ప్రాంత భూములను పరిశీలించారు. ఇక్కడ భూముల స్థితిగతులు, ఇతర సౌకర్యాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిస్తామని పర్యటనల సందర్భంగా ఉన్నతాధికారులు చెప్పారు. ఈ తరహా నివేదికలను గతంలో ఎన్నోసార్లు, అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. గత ప్రభుత్వం సమగ్ర నివేదికలు రూపొందించి కార్యాచరణ కూడా చేపట్టింది. అదేమీ పట్టించుకోకుండా ఒక్క అడుగు ముందుకు వెయ్యకుండా ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ పరుగులు పెడుతుండటంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి ప్రయత్నం తప్ప పారిశ్రామిక అభివృద్ధిపై ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

Updated Date - 2023-11-28T22:50:11+05:30 IST