Share News

ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరికలు

ABN , First Publish Date - 2023-11-28T00:57:09+05:30 IST

కంభం మండలం దర్గా గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన 30 కుటుంబాల వారు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.

ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరికలు

కంభం, నవంబరు 27 : కంభం మండలం దర్గా గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన 30 కుటుంబాల వారు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. సోమవారం కందులాపురం కూడలిలో అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి కేతం శ్రీనివాసులు, దేమా రవివర్మ ఆధ్వర్యంలో 30 కుటుంబాల వారు చేరారు. వీరిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. టీడీపీలో చేరిన వారిలో దేమా ఆంజనేయులు, యంబాడి వెంకటేశ్వర్లు, భూపని శ్రీనివాసులు, సుబ్బారాయుడు, కోటేశ్వరరావు, గజ్జల శ్రీనివాసు లు, వెంకటేశ్వర్లు, బాలగుర వయ్య, బ్రహ్మయ్య, శ్రీకాంత్‌, బసవయ్య, నాగయ్య, టీడీపీ నాయకులు అహమ్మద్‌, దాదా, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-28T00:57:12+05:30 IST