Share News

ఆయిల్‌ రిఫైనరీ పరిశ్రమ కోసం భూముల పరిశీలన

ABN , First Publish Date - 2023-11-29T00:26:36+05:30 IST

మండలంలో పరిశ్రమ ల ఏర్పాటు నిమిత్తం గత ప్రభుత్వంలో ఎంపిక చేసిన భూములను, వాటికి సంబంధించి పరిశ్రమ ఏర్పాటు నిమిత్తం దొనకొండ విచ్చేసిన భారత్‌ పెట్రోలియం లిమిటెడ్‌ సంస్థ ప్రతినిదులు, రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్‌, ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం పర్యవేక్షించారు. రుద్రసముద్రం, బాదాపురం, ఇండ్లచెరువు, రాగమక్కపల్లి తదితర రెవెన్యూ గ్రా మాల పరిధిలో ఎంపిక చేసిన మొత్తం ఎనిమిది వేల ఎకరాలకు సంబంధించిన భూమిలోని సౌకర్యాలను పరిశీలించారు.

ఆయిల్‌ రిఫైనరీ పరిశ్రమ కోసం భూముల పరిశీలన
మ్యాప్‌లో చూస్తున్న పరిశ్రమలశాఖ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌

కారిడార్‌ ఏర్పాటు

సౌకర్యాలపై ప్రతినిధుల ఆరా

దొనకొండ, నవంబరు 28 : మండలంలో పరిశ్రమ ల ఏర్పాటు నిమిత్తం గత ప్రభుత్వంలో ఎంపిక చేసిన భూములను, వాటికి సంబంధించి పరిశ్రమ ఏర్పాటు నిమిత్తం దొనకొండ విచ్చేసిన భారత్‌ పెట్రోలియం లిమిటెడ్‌ సంస్థ ప్రతినిదులు, రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్‌, ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం పర్యవేక్షించారు. రుద్రసముద్రం, బాదాపురం, ఇండ్లచెరువు, రాగమక్కపల్లి తదితర రెవెన్యూ గ్రా మాల పరిధిలో ఎంపిక చేసిన మొత్తం ఎనిమిది వేల ఎకరాలకు సంబంధించిన భూమిలోని సౌకర్యాలను పరిశీలించారు. భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన మ్యాపుల్లో జిల్లా కేంద్రమైన ఒంగోలు, రామాయపట్నం పోర్టు, వెలిగొండ ప్రా జెక్టు, నేషనల్‌ హైవే రహదారి తదితర సౌకర్యాలు ఈ ప్రాంతం నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నా యో అడిగి తెలుసుకున్నారు. భారీ వాహనాలు ఈ ప్రాంతానికి చేరుకునేందుకు సరైన రావాణా సౌకర్యం ఎటు నుంచి ఉందని అధికారులను ప్రశ్నించగా మా ర్కాపురం నుంచి వచ్చే రహదారిని మ్యాప్‌లో చూపించారు. ఈ ప్రాంతంలో భారత్‌ పెట్రోలియం సంస్థ నేతృత్వంలో ఆయిల్‌ రిఫైనింగ్‌ పరిశ్రమ ఏర్పాటు చేపట్టి విదేశాల నుంచి షిప్‌లలో ముడి సరుకును రప్పించి ఇక్కడ రిఫైనింగ్‌ చేపట్టేలా పరిశ్రమ ఏర్పాటు చేపట్టేందుకు అనువైన భూమిని పరిశీలించినట్లు సమాచారం. అందుకోసం దాదాపు నాలుగు వేల ఎకరాలు అవసరం ఉంటుందని ఆ భూమి మధ్యలో ఎటువంటి రహదారులు లేకుండా గుర్తిస్తే పరిశీలిస్తామని ప్రతినిధులు అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కనిగిరి ఆర్డీవో పాలపర్తి జాన్‌ ఇర్విన్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ వీ గోపీకృష్ణ, దర్శి, దొనకొండ తహసీల్దార్లు కే వెంకటేశ్వరరావు, ఎం.సువర్ణ, వీఆర్వోలు ఐలూరి పిచ్చిరెడ్డి, తన్నీరు హరినారాయణ, లైసెన్స్‌ సర్వేయర్‌ చెన్నంశెట్టి వెంకటరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

నిమ్జ్‌తో ఉపాధి అవకాశాలు

పామూరు : పశ్చిమ ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్‌ (నిమ్జ్‌)తో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పాడుతాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. మండలంలోని మాలకొండాపురం వద్ద నిమ్జ్‌ భూ ములను మంగళవారం పరిశీలించారు. పరిశ్రమలు ఏర్పాటుకు అవసరమైన నీటి లభ్యత తదితర వాటిపై అధికారులను అడిగి తె లుసుకున్నారు. మోపాడు జలాశయం నుంచి నీరు అందించాలని అందుకు వెలిగొండ నీటిని మోపాడుకు అనుసంధానం చేయాల్సి ఉం టుందని అధికారులు తెలిపారు. దీనికి నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి పంపించా మని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఆవుల సురేష్‌, ఆర్‌ఐ మల్లికార్జున, సర్వేయర్‌ స్నేహ, వీఆర్వోలు షేక్‌ ఖాజారఫి, శ్రీను, గ్రామ సర్వేయర్‌ పవన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:26:38+05:30 IST