Share News

వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం

ABN , First Publish Date - 2023-11-29T01:30:18+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ పాలన రాక్షస పాలన కొనసాగుతోందని, అరాచకాలు, దోపిడిలు,దౌర్జనాలు మినహా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధిం జరగడం లేదన్నారు.

వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం

బేస్తవారపేట, నవంబరు28 : రాష్ట్రంలో వైసీపీ పాలన రాక్షస పాలన కొనసాగుతోందని, అరాచకాలు, దోపిడిలు,దౌర్జనాలు మినహా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధిం జరగడం లేదన్నారు. గిద్దలూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ ముత్తుముల అశోక్‌రెడ్డి, జనసేన ఇన్‌చార్జీ బెల్లంకొండ సాయిబాబు ఆధ్వర్యంలో మండలంలోని సలకలవీడు గ్రామంలో బాబుష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోలోని అంశాలు వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికలు అరాచక పాలనకు, అభివృద్ధికి మధ్య జరగనున్నాయన్నారు. గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమం సక్రమంగా అమలు జరగాలంటే టీడీపీ- జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సొరెడ్డి మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుంటిక నరసింహా యాదవ్‌, గుంటిక కొండయ్య యాదవ్‌, వరిమడుగు మల్లిఖార్జునరెడ్డి, జెట్టె వెంకటేశ్వర్లు,కదిరి శంకర్‌, కదిరి వెంకటరామయ్య, జెట్టె ఆవులయ్య, వరికుంట్ల పెద్ద వెంకటసుబ్బయ్య, కదిరి నారాయణ, జనసేన నాయకులు జిల్లా కార్యదర్శి లంకా నరసింహారావు, కంభం టీడీపీ మండల అధ్యక్షులు తాడిశెట్టి ప్రసాద్‌, బేస్తవారపేట అధ్యక్షులు ఎం.మధుసుధన్‌రెడ్డి, కువ్వారపు దేవరాజు, ఇళ్లూరి అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలో 30 కుటుంబాల చేరిక

పొదిలి : నగర పంచాయతీ పరిధిలోని పోతవరం గ్రామంలో సుమారు 30 ఎస్సీ కుటుంబాలు మంగళ వారం టీడీపీలో చేరాయి. వారికి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందుల నారాయణరెడ్డి కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. వైసీపీ పాలనతో విసుగు చెంది కందుల నారాయణరెడ్డిపై ఉన్న భరోసాతో టీడీపీ లో చేరుతున్నట్లు తెలిపారు. టీడీపీలో చేరిన వారిలో గాలిముట్టి శ్యాంబాబు, గాలిముట్టి దేవదాసు, గాలిముట్టి ఆనంద్‌, శ్యాంసన్‌, నరసింహారావు, బలరాం, మరియబాబు, సుమన్‌, నరసింహులు, నరసయ్య, రాచపూడి వెంకటేష్‌, యాకోబు, గాలిముట్టి సాంసన్‌, యోసయ్య, సామ్యూల్‌, ఏసుబాబు, అనీల్‌, అంకయ్య, ధామస్‌, రవి, సుధాకర్‌రావు, బాలరాజు, ప్రవీణ్‌, చింటూ, విజయబాబు, సతీష్‌, మనోజ్‌, అంకయ్య, పెద్దయ్య, నవయ్య, శరత్‌బాబు తదితరులున్నారు. వారందరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన నారాయణరెడ్డి మాట్లా డుతూ వైసీపీ నాయకుల దురాగాతాలను ఎండగడుతూ టీడీపీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి తాను అండగా ఉంటానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల, గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

భూకబ్జా బాధితులకు భూములు అందజేస్తాం

మార్కాపురం రూరల్‌ : వైసీపీ నాయకులు ఆక్రమిం చిన భూములను టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బాధితులకు భూములు అందజేస్తామని టీడీపీ నియోజకవర్గ పోల్‌ మేనేజ్మెంట్‌ క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ కందుల రామిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మార్కా పురంలో విలేకర్లతో మాట్లాడారు. భూ ఆక్రమణలపై ఎమ్మెల్యే సోదరుడు, వైసీపీ నాయకులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది ఆ పార్టీకి చెందిన వారేనన్నారు. వారిని తాము ఎలా ఫిర్యాదు చేయడానికి పంపిస్తామన్నారు. భూకబ్జా బురదలో కూరుకుపోయిన వారు ఆ బురదను తమకు అంటించాలని చూస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో 100 పడకల వైద్యశాలను జిల్లా వైద్యశాలగా మార్చామని గుర్తుచేశారు. చెన్నకేశవస్వామి ఆలయం అభివృద్ధికి ఎంతో కృషి చేశామన్నారు. వైసీపీ నాయకులు రాజకీయ కక్షతో టీడీపీ నాయకుల ఆర్థిక మూలలపై దెబ్బతీస్తున్నారన్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గడ్డ.మల్లికార్జున, రామానుజలరెడ్డి, శ్రీనివాసులు, ఎన్‌.కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T01:30:21+05:30 IST