Share News

నయవంచక వైసీపీ నేతలను తరిమికొట్టండి

ABN , First Publish Date - 2023-11-29T00:24:07+05:30 IST

కనిగిరి ప్రజలను నయవంచన చేసిన వైసీపీ నేతలను వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కనిగిరి మండలంలోని బల్లిపల్లి గ్రామంలో మంగళవారం బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఉగ్ర ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామస్థులు ఉగ్రకు వివరించారు. ఎన్నికలకు ముందు ఇంటింటికీ తాగు నీరిస్తామని ఓట్లు దండుకున్న వైసీపీ నేతలు తమ సమస్యలను పట్టించుకోలేదని స్థానికులు ఉగ్ర ముందు వాపోయారు. మంచి నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు.

నయవంచక వైసీపీ నేతలను తరిమికొట్టండి
బల్లిపల్లిలో మహిళా పథకాలను వివరిస్తున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

నయవంచక వైసీపీ నేతలను తరిమికొట్టండి

టీడీపీ శ్రేణులు, ప్రజలకు

మాజీ ఎమ్మెల్యే డాకర్‌ ఉగ్ర పిలుపు

కనిగిరి, నవంబరు 28 : కనిగిరి ప్రజలను నయవంచన చేసిన వైసీపీ నేతలను వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కనిగిరి మండలంలోని బల్లిపల్లి గ్రామంలో మంగళవారం బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఉగ్ర ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామస్థులు ఉగ్రకు వివరించారు. ఎన్నికలకు ముందు ఇంటింటికీ తాగు నీరిస్తామని ఓట్లు దండుకున్న వైసీపీ నేతలు తమ సమస్యలను పట్టించుకోలేదని స్థానికులు ఉగ్ర ముందు వాపోయారు. మంచి నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు. గ్రామంలో మురుగు కాల్వలు, రోడ్లు లేకపోవడంతో వానపడితే నరకం చూస్తున్నామని ఏకరువుపెట్టారు. పెరిగిన సరుకులు, కరెంట్‌ చార్జీలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. అనంతరం ఉగ్ర మాట్లాడుతూ ఒక్క చాన్స్‌ అంటూ వచ్చిన వైసీపీ పాలకులందరూ ప్రజా సమస్యలను గాలికొదిలేశారని ధ్వజమెఆ్తరు. వెలిగొండ జలాలతో కనిగిరి ప్రాంత పొలాలను సస్యశ్యామలం చేస్తానని ఎన్నికల వేళ మాటిచ్చిన ప్రజాప్రతినిధి మడంతిప్పారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించారని అన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసవెళ్తున్నారని అన్నారు. వైసీపీ చేతగాని పాలనకు ఇది నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇంటింటికీ మంచినీటిని అందిస్తానని, నిమ్జ్‌ పూర్తి చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని మాటిచ్చారు. వెలిగొండ నీటిని తెప్పించి రైతులకు మేలు చేయాలన్నదే తన లక్ష్యమని ఉగ్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్‌ పిచ్చాల శ్రీనివాసులురెడ్డి, టీడీపీ సీనియర్‌ నాయకులు భేరిపుల్లారెడ్డి, నంబలు వెంకటేశ్వర్లు, బాలు ఓబులురెడ్డి, గంగవరపు నాగిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధిని విస్మరించిన వైసీపీ

పామూరు, నవంబరు 28 : వైసీపీ ప్రభుత్వం పంచాయతీ నిధులను దారిమళ్లించి గ్రామాభివృద్ధిని విస్మరించిందని తెలుగు రైతు అధ్యక్షుడు మన్నం రమణయ్య అన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర, మండల పార్టి అధ్యక్షుడు పువ్వాడి ఆదేశాల మేరకు కంభాలదిన్నె గ్రామ బూత్‌ కమిటీ ఇన్‌చార్జిలు మల్లెల శ్రీనివాసులు, కొమ్మలపాటి మదన్‌ ఆధ్వర్యంలో మంగళవారం బాబు ష్యూరిటీ..భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. పేద, మధ్యతరగతి మహిళలు, వారి కుటుంబాలు ఆర్థికంగా బలపడాలన్న ఉద్దేశంతో మేనిఫెస్టోలో సూపర్‌ సిక్స్‌ పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, తల్లికి వందనం పేరుతో రూ.15 వేలు, నిరోద్యోగులకు రూ.3వేల భృతి, ఆడబిడ్డలకు రూ.1500, రైతులకు పంట పెట్టుబడికి రూ.20వేలు అందజేస్తారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఏలూరి రమణమ్మ, చిన్నమ్మి, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

బాబుతోనే యువత భవిత

ముండ్లమూరు : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేతుల్లోనే యువత భవిష్యత్‌ ఉందని టీడీపీ మండల అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు అన్నారు. మంగళవా రం మండలంలోని భీమవరంలో బాబు ష్యూ రిటీ..భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ మేనిఫెస్టో కరపత్రా లను పంపిణీ చేశారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ యువత భవిష్యత్‌ చంద్రబాబు చేతుల్లోనే ఉందన్నారు. ఆయన ముఖ్యమంత్రి ఐ తేనే తప్ప రాష్ట్రం బాగుపడదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే టీడీ పీని గెలిపించుకోవాలన్నారు. ఒక్కసారి అని ప్రజల చేత ఓట్లు వేయించుకొని నాలుగున్నర సంవత్సరాలైనా కూడా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వల్ల ఒక్కరికి కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చిన సందర్భాలు లేవన్నారు. కాగా వీరు రాష్ట్రాన్ని అదోగతి పాలు చేశారన్నారు. అభివృద్ధి పక్కన పెట్టి టీడీపీ నేతలు, కార్యకర్తలను వేదింపులకు గురి చేస్తున్నారన్నారు. ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడును 53 రోజులుగా జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందారన్నారు. మరో ఐదు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, ఆ ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ, టీడీపీ సీనియర్‌ నేత సుంకర రాఘవరెడ్డి, టీడీపీ నేతలు అబ్బూరి గోవిందయ్య, కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:24:09+05:30 IST