Shilpa Chakrapani Reddy: రైతులతో శిల్పాచక్రపాణిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-01-27T18:12:51+05:30 IST
రైతులతో ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి (Shilpa Chakrapani Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెలుగోడు మండలం రేగడగూడూరులో రైతులు ఎమ్మెల్యేను కలిశారు...
నంద్యాల: రైతులతో ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి (Shilpa Chakrapani Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెలుగోడు మండలం రేగడగూడూరులో రైతులు ఎమ్మెల్యేను కలిశారు. రబీలో తెలుగుగంగ (Telugu Ganga) ఆయకట్టుకు సాగునీరు అందించాలని రైతులు కోరారు. ‘అధికారులు ఎటైనా వెళ్తారు.. మీ చావు మీరు చావండి’ అని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. శిల్పా వ్యాఖ్యలపై రైతులు (farmers), రైతు సంఘాలు మండిపడుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో శిల్పాచక్రపాణిరెడ్డి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తెలుగుగంగ, కేసీ కెనాల్ ఆయకట్టు రైతుల నిరసన ఉధృతం అయింది. రబీ సీజనలో తెలుగుగంగ ఆయకట్టు పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది. తెలుగుగంగ కాల్వ లైనింగ్ పనులు చేపట్టేందుకు వీలుగా ఫిబ్రవరి 15 వరకే పంటలకు నీరు ఇస్తామని కలెక్టర్ ప్రకటించారు. దీంతో వెలుగోడు, మహానంది, బండి ఆత్మకూరు మండలాల్లో పంటలు సాగు చేసిన రైతులు ఆందోళన బాట పట్టారు. బాధిత రైతులకు శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి (Budda Rajasekhara Reddy) మద్దతుగా నిలిచారు. రైతులు ఉద్యమానికి టీడీపీ కూడా మద్దతు ప్రకటించింది.