Share News

Srikakulam Dist.: పలాసలో వైసీపీ నేతలకు పరాభవం

ABN , Publish Date - Dec 14 , 2023 | 01:26 PM

శ్రీకాకుళం జిల్లా: పలాసలో వైసీపీ నేతలకు పరాభవం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ ముందు బలప్రదర్శన చేయాలనుకున్న జిల్లా వైసీపీ నేతలకు చుక్కెదురైంది. సీఎం సభా వేదిక దగ్గరకు వచ్చిన జనం ఐదు నిమిషాల్లో వెనుదిరగటంతో వైసీపీ నేతలు అసంతృప్తి చెందారు.

Srikakulam Dist.: పలాసలో వైసీపీ నేతలకు పరాభవం

శ్రీకాకుళం జిల్లా: పలాసలో వైసీపీ నేతలకు పరాభవం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ ముందు బలప్రదర్శన చేయాలనుకున్న జిల్లా వైసీపీ నేతలకు చుక్కెదురైంది. సీఎం సభా వేదిక దగ్గరకు వచ్చిన జనం ఐదు నిమిషాల్లో వెనుదిరగటంతో వైసీపీ నేతలు అసంతృప్తి చెందారు. ఇంటి ముఖం పట్టిన జనాలను పోలీసులతో ఆపాలని చూసినా వారు ఆగలేదు. ముఖ్యమంత్రి జగన్ మాటలు కూడా వినకుండానే జనం వచ్చిన త్రోవనే వెనుదిరిగారు.

మరోవైపు ముఖ్యమంత్రి జగన్ శ్రీకాకుళం జిల్లా కంచిలి - పలాస పర్యటన నేపథ్యంలో స్థానికులు, ప్రయాణీకులు నరకం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీఎం పర్యటన పురష్కరించుకుని పోలీసులు షాపులను మూయిస్తున్నారు. దీనిపై షాపుల యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జగన్ సభకు జిల్లాలోని పలు కళాశాలల నుంచి భారీగా విద్యార్ధులను తరలిస్తున్నారు. అంతేగాక ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రైవేటు విద్యా సంస్ధలను కూడా మూసివేశారు. ఆర్టీసీ బస్సులన్నీ జనం తరలింపుకే వెళ్లడంతో ప్రయాణికుల అవస్తలు అన్నీఇన్నీకావు. ఇదిలా ఉండగా సీఎం జగన్ సభకు మొత్తం మూడువేలమంది పోలాసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Updated Date - Dec 14 , 2023 | 01:26 PM