సాయంత్రమైతే అంధకారమే..

ABN , First Publish Date - 2023-10-05T00:05:20+05:30 IST

కాశీబుగ్గ బస్టాండ్‌ అంధకారంలో మగ్గుతోంది. సాయంత్రం 6 దాటితే చాలు చిమ్మ చీకట్లు కమ్ముకుంటాయి. విద్యుత్‌ దీపాలు వెలగకపోవడంతో చీకట్లో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రెండేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది.

 		సాయంత్రమైతే అంధకారమే..
అంధకారంలో కాశీబుగ్గ బస్టాండ్‌

- రెండేళ్లవుతున్నా బాగుచేయని వైనం

- చీకట్లో ప్రయాణికుల అవస్థలు

కాశీబుగ్గ, అక్టోబరు 4: కాశీబుగ్గ బస్టాండ్‌ అంధకారంలో మగ్గుతోంది. సాయంత్రం 6 దాటితే చాలు చిమ్మ చీకట్లు కమ్ముకుంటాయి. విద్యుత్‌ దీపాలు వెలగకపోవడంతో చీకట్లో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రెండేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. కాశీబుగ్గ బస్టాండ్‌ నుంచి ప్రతిరోజూ 10వేల మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుం టారు. టెక్కలి డివిజన్‌లోని 11 మండలాల ప్రయాణికులతో పాటు ఒడిశా వాసులు సైతం ఈ బస్టాండ్‌కే వస్తుంటారు. ఆర్టీసీ బస్సులు 200, ప్రైవేటు బస్సులు 100 వరకూ ఇక్కడ నిలుపుదల చేస్తుంటారు. అటువంటి బస్టాండ్‌ సాయంత్రం 6 గంటలు దాటితే చీకటిగా మారుతోంది. విద్యుత్‌ దీపాలు పాడైనా సంబంధిత శాఖ అధికారులు మార్చడం లేదు. అటు మునిసిపల్‌ యంత్రాంగం సైతం పట్టించుకోవడం లేదు. దీనికితోడు బస్టాండ్‌ను ఆక్రమించి చిరువ్యాపారులు వ్యాపారా లను సాగిస్తున్నారు. పశువులు, పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర పడు తున్నారు. రాత్రి సమయంలో మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుంది. దీనిపై ఫిర్యాదు చేస్తే బస్టాండ్‌ తమ అధీనంలో లేదని ఆర్టీసీ, మునిసిపల్‌ అధికారులు తప్పించుకుంటున్నారని స్థానికులు చెబుతున్నా రు. గతంలో ఈ విషయమై మునిసిపల్‌ సమావేశంలో కొంతమంది కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు చర్చించారు. కానీ పనులు మాత్రం జరగలేదు. ఇప్పటికైనా బస్టాండ్‌పై దృషి సారించాలని వ్యాపారులు, ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - 2023-10-05T00:05:20+05:30 IST