Share News

మోటారు ప్రమాద కేసులు ఎక్కువగా రాజీ చేయాలి

ABN , First Publish Date - 2023-11-28T23:56:34+05:30 IST

జాతీయ లోక్‌అదాలత్‌లో ఎక్కువగా మోటార్‌ ప్రమాద కేసులు రాజీ చేయాలని జిల్లా న్యాయాధికారి జేఏ మౌలానా సూచించారు.

మోటారు ప్రమాద కేసులు ఎక్కువగా రాజీ చేయాలి
మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి జెఏ మౌలానా

- జిల్లా న్యాయాధికారి జేఏ మౌలానా

అరసవల్లి, నవంబరు 28 : జాతీయ లోక్‌అదాలత్‌లో ఎక్కువగా మోటార్‌ ప్రమాద కేసులు రాజీ చేయాలని జిల్లా న్యాయాధికారి జేఏ మౌలానా సూచించారు. వచ్చే నెల 9న జాతీయలోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా కోర్టులోని కాన్ఫరెన్స్‌ హాల్లో అడ్వకేట్లు, ఇన్స్యూరెన్స్‌ కంపెనీ స్టాండింగ్‌ కౌన్సిల్‌, బ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయాధికారి జేఏ మౌలానా మాట్లాడుతూ.. లోక్‌అదాలత్‌తో కక్షిదారులకు సత్వర పరిష్కారం దొరుకుతుందన్నారు. ఇన్స్యూరెన్స్‌ కంపెనీలకు కూడా కోర్టు ఖర్చులు, వడ్డీ తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఆర్‌.సన్యాసినాయుడు, జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్ని సూర్యారావు, అడ్వకేట్లు రాంబాబునాయుడు, రమేష్‌కుమార్‌, శాంతారామ్‌, గోవిందరాజులు, ఇన్స్యూరెన్స్‌ కంపెనీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ మంచు జనార్దనరావు, ఎస్‌.రాజేశ్వరరావు, ఆర్టీసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ సింహాచలం, కొమరాపు ఆఫీసు, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-28T23:56:35+05:30 IST