Share News

జాతీయస్థాయి పోటీలకు శ్రీకాకుళం విద్యార్థులు

ABN , First Publish Date - 2023-11-28T23:55:03+05:30 IST

శ్రీకాకుళం నగరంలోని ఆదిత్య అర్చరీ అకాడమీ విద్యార్థులు పార్వతీపు రం గురుకుల పాఠశాల లో ఇటీవల జరిగిన 67వ స్కూల్‌గేమ్స్‌ రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తాచాటి జాతీ యస్థాయి పోటీలకు అర్హత సాధించారు. అండర్‌-17 బాలికల రికర్వ్‌ రౌండ్‌లో పైడి త్రివేణి ద్వితీయ, అండర్‌-14 బాలుర రికర్వ్‌రౌండ్‌లో ఆరంగి కళ్యాణ్‌ తృతీయ, అండర్‌-14బాలికల కాం పౌండ్‌ రౌండ్‌లో గోపిన లక్ష్మి తన్విక తృతీయ స్థానం, బాలుర విభాగంలో కొయ్యాన నీలమనోహర్‌నాయుడు రాష్ట్రస్థాయి లో సత్తాచాటి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు.వీరంతా డిసెంబరు 12,13వ తేదీల్లో గుజరాతీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని అకాడ మీ డైరక్టర్‌ చెటకం రాజ్‌కుమార్‌ తెలియ జేశారు. శిక్షకుడు ఎ.మధుసూదనరావు, బి.ఈశ్వరరావు, ఎస్‌.శ్రీనివాసరావు, అర్చరీ సంఘం కార్యదర్శి చిట్టిబాబు, పైడి గోవిందరావు,లక్ష్మణరావు, జి.వెంకటరావు, జి.కృష్ణ ప్రసాద్‌ విద్యార్థులకు అభినందించారు.

జాతీయస్థాయి పోటీలకు శ్రీకాకుళం విద్యార్థులు

శ్రీకాకుళం స్పోర్ట్స్‌: శ్రీకాకుళం నగరంలోని ఆదిత్య అర్చరీ అకాడమీ విద్యార్థులు పార్వతీపు రం గురుకుల పాఠశాల లో ఇటీవల జరిగిన 67వ స్కూల్‌గేమ్స్‌ రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తాచాటి జాతీ యస్థాయి పోటీలకు అర్హత సాధించారు. అండర్‌-17 బాలికల రికర్వ్‌ రౌండ్‌లో పైడి త్రివేణి ద్వితీయ, అండర్‌-14 బాలుర రికర్వ్‌రౌండ్‌లో ఆరంగి కళ్యాణ్‌ తృతీయ, అండర్‌-14బాలికల కాం పౌండ్‌ రౌండ్‌లో గోపిన లక్ష్మి తన్విక తృతీయ స్థానం, బాలుర విభాగంలో కొయ్యాన నీలమనోహర్‌నాయుడు రాష్ట్రస్థాయి లో సత్తాచాటి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు.వీరంతా డిసెంబరు 12,13వ తేదీల్లో గుజరాతీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని అకాడ మీ డైరక్టర్‌ చెటకం రాజ్‌కుమార్‌ తెలియ జేశారు. శిక్షకుడు ఎ.మధుసూదనరావు, బి.ఈశ్వరరావు, ఎస్‌.శ్రీనివాసరావు, అర్చరీ సంఘం కార్యదర్శి చిట్టిబాబు, పైడి గోవిందరావు,లక్ష్మణరావు, జి.వెంకటరావు, జి.కృష్ణ ప్రసాద్‌ విద్యార్థులకు అభినందించారు.

కరాటే పోటీలో బంగారు పతకం

ఇచ్ఛాపురం రూరల్‌ : ఈదుపురం ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదు వుతున్న మాధవి శెట్టి అంతర్జాతీయ కరాటే పోటీలో బంగారు పథకం సాధించిందని హెచ్‌ఎం బి.తమ్మయ్య తెలిపారు. విశాఖ ఫోర్టు స్టేడియంలో ఈనెల 24 నుంచి జరిగిన 19వ అంతర్జాతీయ కరాటే పోటీలో సీనియర్‌ విభాగంలో పాల్గొని బంగారు పథకం సాధించినట్లు చెప్పారు.ఈ మేరకు మంగళవారం ఉపాధ్యాయులు రాంబా బు, రామకృష్ణ, శశిభూషణ్‌ గౌడో, నేతాజి, వెంకటరావు, నీలకంఠం, సింగమ్మ, లక్ష ్మ ణరావు, నరేంద్ర కుమార్‌, సింహాచలం పాల్గొన్నారు.

ఫఇచ్ఛాపురం : గిరిసోలకు చెందిన బోది ధర్మ కరాటే శిక్షణ సంస్థ చీఫ్‌ కోచ్‌ ప్రకాష్‌ విశాఖలో జరిగిన అంతర్జాతీయ కరాటీ పోటీల్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నట్లు కోచ్‌ కిరమణి తెలిపారు. కుముటో విభాగంలో ప్రత్యర్థిని మట్టికరి పించిన ప్రకాష్‌ను సీనీ నటుడు సుమన్‌ అభినందించారు.

స్విమ్మింగ్‌ పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులు

ఇచ్ఛాపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన గోవింద్‌ బెహరా, సింహాచ లం బెహరా తిరుపతిలో ఇటీవల జరిగిన స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌-18 అంత ర్‌ జూనియర్‌ కళాశాల స్విమ్మింగ్‌ పోటీల్లో సత్తాచాటారు ఈమేరకు మంగళవారం ప్రిన్సిపాల్‌ శంకర్‌ప్రసాద్‌, సిబ్బంది అభినందించారు.

కబడ్డీలో గురుకుల విద్యార్థిని

అరసవల్లి: పెద్దపాడు అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల విద్యార్థిని రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో సత్తాచాటింది.తిరుపతిలో ఈనెల 24 నుంచి జరిగిన రాష్ట్రస్థాయి అం డర్‌-17 కబడ్డీ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాఠశాల విద్యార్థిని ఎ.దీపిక సిల్వర్‌ పత కం కైవసం చేసుకుందని ప్రిన్సిపాల్‌ మార్పు జ్యోతి తెలిపారు. మంగళవారం పాఠ శాలలో అభినందించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ మాధవీలత, వ్యాయామ ఉపాధ్యాయిని పుష్పవాణి, పీఈటీ జయశ్రీ, వార్డెన్‌ హఫీజ్‌ బేగం పాల్గొన్నారు.

Updated Date - 2023-11-28T23:55:04+05:30 IST