Share News

రాక్షస పాలనకు చరమగీతం పలకాలి

ABN , First Publish Date - 2023-11-28T23:59:47+05:30 IST

వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు తెలిపారు. మం డలంలోని బెజ్జిపురం, బుడుమూరుల్లో బాబు ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఒక్క చాన్స్‌ అంటూ ప్రజలను వంచించి అధికారం చేపట్టిన వైసీపీ రాష్ట్రంలో అరాచక పాలనతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోం దన్నా రు. ఈప్రభుత్వాన్ని సాగనంపేందుకు రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. చంద్రబాబునాయుడుతోనే ప్రజారంజక పాలన సాధ్యమని ప్రజలు విశ్వసి స్తున్నారన్నారు.కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు ముప్పిడి సురేష్‌, ప్రధాన కార్యదర్శి పి.మధుబాబు,ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఇనపకుర్తి తోటయ్య దొర,నాయకులు మీసాల వెంకటరమణ, దన్నాన శ్రీనివాసరావు, వడ్డి పల్లి శ్రీనివాసరావు, నల్లి లక్ష్మునాయుడు, పండి గోపాలరావు పాల్గొన్నారు.

రాక్షస పాలనకు చరమగీతం పలకాలి
లావేరు: మాట్లాడుతున్న కళావెంకటరావు :

ఫలావేరు: వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు తెలిపారు. మం డలంలోని బెజ్జిపురం, బుడుమూరుల్లో బాబు ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఒక్క చాన్స్‌ అంటూ ప్రజలను వంచించి అధికారం చేపట్టిన వైసీపీ రాష్ట్రంలో అరాచక పాలనతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోం దన్నా రు. ఈప్రభుత్వాన్ని సాగనంపేందుకు రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. చంద్రబాబునాయుడుతోనే ప్రజారంజక పాలన సాధ్యమని ప్రజలు విశ్వసి స్తున్నారన్నారు.కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు ముప్పిడి సురేష్‌, ప్రధాన కార్యదర్శి పి.మధుబాబు,ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఇనపకుర్తి తోటయ్య దొర,నాయకులు మీసాల వెంకటరమణ, దన్నాన శ్రీనివాసరావు, వడ్డి పల్లి శ్రీనివాసరావు, నల్లి లక్ష్మునాయుడు, పండి గోపాలరావు పాల్గొన్నారు.

ఫజి.సిగడాం: బాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టీడీపీ విజయనగరం పార్లమెంట్‌ బీసీ అధికార కమిటీ సభ్యుడు కంచరాన సూరన్నాయుడు తెలి పారు. దవళపేటలో భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఫ సరుబుజ్జిలి: మండలంలోని కొండ్రుగూడలో టీడీపీ నాయకుడు కొర్ను సూర్యనారాయణ ఆధ్వర్యంలో బాబు షూరిటీ కార్య క్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు.

ఫజలుమూరు (నరసన్నపేట): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం కావడంతో ఫ్యాన్‌కు ఉక్కపోత మొదలైందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. నరసన్నపేట మండలంలోని బొరిగివలసలో బాబు ష్యూరిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం, రచ్చబండ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు తంగి తారకేశ్వరరావు, దామోదర నర్సింహమూర్తి, చల్ల రమణ, కింజరాపు రామారావు, బైరి భాస్కరరావు, బోర వెంకటరావు, పల్లి సీతాపతి, తంగి అప్పలరామన్న పాల్గొన్నారు.

ఫకోటబొమ్మాళి: మండలంలోని పట్టుపురం, శ్రీజగన్నాథపురం, హరిశ్చం ద్రపురం, చీపుర్లపాడు పంచాయతీల్లో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆయా పంచాయతీల నేతలు బొడ్డపు రాంబాబు, చిట్టి సింహాచలం, బొడ్డాపు శ్రీను, గొండు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

ఫ టెక్కలి: మేఘవరం పంచాయతీ బొరిగిపేటలో బాబు ష్యూరిటీ భవి ష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మం డలాధ్యక్షుడుబగాది శేషగిరి,నాయకులు కెల్లి శ్రీరాములు, మల్లేషు, కుసు మారావు, లక్ష్మణ్‌, జయలక్ష్మి పాల్గొన్నారు.

ఫమందస: మందసలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్ర మం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు రట్టి లింగరాజు, రాజాన మహేష్‌, తెల్లి హరికృష్ణ, గార కృష్ణారావు, ఎం.నవీన్‌కుమార్‌, బూరగాపు శంకర్‌, ఎం.చిరంజీవి పాల్గొన్నారు.

ఫజలుమూరు (సారవకోట): సారవకోట మండలంలోని బుడితి బీసీ కాల నీ, అవలింగి, చీడిపూడి గ్రామాల్లో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా టీడీపీ మేనిఫెస్టోను వివరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, నాయకులు పొన్నాన శంకరరావు, పి.వేణుగోపాలరావు, అనుపర్తి బాలకృష్ణ, పొన్నాన యుగంధర్‌, గోవిందరావు, బి.విశ్వనాథం పాల్గొన్నారు.

Updated Date - 2023-11-28T23:59:49+05:30 IST