Share News

కచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందిస్తాం

ABN , First Publish Date - 2023-11-29T00:01:06+05:30 IST

తమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు కృషి చేస్తున్నా మని రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఓటర్ల జాబితా పరిశీలకుడు జె.శ్యామలరావు తెలిపా రు. మంగళవారం శ్రీకాకుళంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ రోజు నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితా సవరణలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలను నమోదు చేసుకుని, లిఖిత పూర్వక వినతులను స్వీకరించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు లోబడి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని, ఓటర్లజాబితాలను పారదర్శకంగా తయారు చేస్తామని హామీఇచ్చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాజకీయ పార్టీల సమన్వ యంతో నమోదు ప్రక్రియ జరుగుతోందని, ప్రతి వారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధు లతో నియోజకవర్గ, జిల్లాస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నామని, వారి సూచ నలు, పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. టీడీపీ ప్రతినిధి కూన రవికు మార్‌ మాట్లాడుతూ కొంతమంది మృతుల ఓట్లు, డబుల్‌ ఎంట్రీలను తొలగించాలని, కొత్త ఓటర్ల నమోదు జాబితాలను తమకు అందజేయాలని సూచించారు. సమావేశంలో జేసీ ఎం.నవీన్‌, సహాయ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, ఇన్‌చార్జీ డీఆర్వో జయదేవి, ఆర్డీవోలు రంగయ్య, భరత్‌ నాయక్‌, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, మాజీ ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, కలమట వెంకటరమణ, గుండ లక్ష్మీదేవి, సీపీఎం, కాంగ్రెస్‌, బీజేపీ ప్రతినిధులు గోవిందరావు, మల్లిబాబు, ఉమామహేశ్వరరావు, చల్లా వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.

  కచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందిస్తాం

కలెక్టరేట్‌:కచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు కృషి చేస్తున్నా మని రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఓటర్ల జాబితా పరిశీలకుడు జె.శ్యామలరావు తెలిపా రు. మంగళవారం శ్రీకాకుళంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ రోజు నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితా సవరణలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలను నమోదు చేసుకుని, లిఖిత పూర్వక వినతులను స్వీకరించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు లోబడి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని, ఓటర్లజాబితాలను పారదర్శకంగా తయారు చేస్తామని హామీఇచ్చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాజకీయ పార్టీల సమన్వ యంతో నమోదు ప్రక్రియ జరుగుతోందని, ప్రతి వారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధు లతో నియోజకవర్గ, జిల్లాస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నామని, వారి సూచ నలు, పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. టీడీపీ ప్రతినిధి కూన రవికు మార్‌ మాట్లాడుతూ కొంతమంది మృతుల ఓట్లు, డబుల్‌ ఎంట్రీలను తొలగించాలని, కొత్త ఓటర్ల నమోదు జాబితాలను తమకు అందజేయాలని సూచించారు. సమావేశంలో జేసీ ఎం.నవీన్‌, సహాయ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, ఇన్‌చార్జీ డీఆర్వో జయదేవి, ఆర్డీవోలు రంగయ్య, భరత్‌ నాయక్‌, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, మాజీ ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, కలమట వెంకటరమణ, గుండ లక్ష్మీదేవి, సీపీఎం, కాంగ్రెస్‌, బీజేపీ ప్రతినిధులు గోవిందరావు, మల్లిబాబు, ఉమామహేశ్వరరావు, చల్లా వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా ఉండాలి

కలెక్టరేట్‌: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శక విధానాలు పాటించా లని జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకుడు జె.శ్యామలరావు ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఈఆర్‌వోలు, ఎంఆర్‌వోలతో సమీక్షించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త ఓటర్ల సంఖ్య జనాభా నిష్పత్తికి అనుగుణంగా పెరగాలని, డిసెంబరు 2, 3 తేదీల్లో నిర్వహించనున్న ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కలెక్టర్‌ శ్రీకేష్‌బాలాజీ లఠ్కర్‌ కొత్త ఓటర్ల నమోదు గురించి మండలాల వారీగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.

ఈసీ మార్గదర్శకాలను పాటించాలి

కలెక్టరేట్‌:ఎన్నికల నిర్వహణలో సెక్టార్‌ అధికారులు ఎన్నికల సంఘ(ఈసీ) నిబంధనలనుపాటించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌బాలాజీ లాఠ్కర్‌ ఆదేశించారు. శ్రీకాకుళం లోని జడ్పీ సమావేశ మందిరంలో సెక్టార్‌ అధికారులు, సెక్టార్‌ పోలీసు అధికారుల రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్టార్‌ అధికారుల పాధాన్యతను వివరించారు. సెక్టార్‌ అధికారులు ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిం చి వసతులు, ఓటర్ల అనుకూలతలు, సమస్యాత్మక అంశాలను గుర్తించి నమోదు చేసుకోవాలన్నారు. ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణ అందరి లక్ష్యం కావాలన్నారు. మాస్టర్‌ ట్రైనీ జయదేవి ఎన్నికల నిర్వహణ అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా సెక్టార్‌ అధికారులకు వివరించారు. ఈవీఎంల ద్వారా ఓటింగ్‌ విధానాన్ని తెలి యజేశారు.కార్యక్రమంలో ప్రత్యేక ఉపకలెక్టర్‌ పద్మావతి, జడ్పీ సీఈవో వెంకటరామన్‌, ఆర్డీవోలు సీహెచ్‌ రంగయ్య, భరత్‌ నాయక్‌, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతప ట్నం, నియోజకవర్గాలకు చెందిన సెక్టార్‌ అధికారులు, సెక్టార్‌ పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:01:07+05:30 IST