Share News

లంకెలపాలెం ఫ్లైఓవర్‌పై ప్రమాదం

ABN , First Publish Date - 2023-11-29T00:41:21+05:30 IST

లంకెలపాలెం ఫ్లై ఓవర్‌ వంతెనపై పెను ప్రమాదం తప్పింది. ఫార్మా సిటీ నుంచి లంకెలపాలెం వైపు వెళుతున్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో బలంగా ఢీకొన్నది. దీంతో వెనుక వస్తున్న లారీ క్యాబిన్‌ నుజ్జువ్వడంతో డ్రైవర్‌ క్యాబిన్‌లో చిక్కుకుపోయి గాయపడ్డాడు.

లంకెలపాలెం ఫ్లైఓవర్‌పై ప్రమాదం
నుజ్జుయిన లారీ క్యాబిన్‌

లారీ డ్రైవర్‌కు గాయాలు

లంకెలపాలెం, నవంబరు 28: లంకెలపాలెం ఫ్లై ఓవర్‌ వంతెనపై పెను ప్రమాదం తప్పింది. ఫార్మా సిటీ నుంచి లంకెలపాలెం వైపు వెళుతున్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ బలంగా ఢీకొన్నది. దీంతో వెనుక వస్తున్న లారీ క్యాబిన్‌ నుజ్జువ్వడంతో డ్రైవర్‌ క్యాబిన్‌లో చిక్కుకుపోయి గాయపడ్డాడు. సీఐ ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం. ఫార్మాసిటీ నుంచి లంకెలపాలెం వైపు వెళుతున్న లారీ ఫ్లై ఓవర్‌ దిగుతుండగా డ్రైవర్‌ ఆకస్మికంగా బ్రేకులు వేశాడు. ఇదే సమయంలో ఎన్టీపీసీ నుంచి ఫ్లైయాష్‌తో వెనుకగా వస్తున్న లారీ బలంగా ఢీకొంది. దీంతో ముందు లారీ రెయిలింగ్‌పైకి దూసుకు రావడంతో అది ధ్వంసమైంది. వెనుక లారీ క్యాబిన్‌ నుజ్జయ్యింది. శకలాల్లో చిక్కుకున్న డ్రైవర్‌ మధుసూదనరావును స్థానికుల సాయంతో పోలీసులు బయటకు బయటకు తీశారు. చికిత్స కోసం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. సీఐ ఈశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-11-29T00:41:23+05:30 IST