Share News

సిటీ మధ్యకు హెచ్‌పీసీఎల్‌ స్కిల్‌ శిక్షణ కేంద్రం

ABN , First Publish Date - 2023-11-29T01:18:33+05:30 IST

ముడసర్లోవ రోడ్డులో కృష్ణాపురం వద్ద జీవీఎంసీ భవనాల్లో గత తొమ్మిదేళ్లుగా నిర్వహిస్తున్న హెచ్‌పీసీఎల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ కేంద్రం ద్వారకానగర్‌ ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి మారబోతోంది.

సిటీ మధ్యకు హెచ్‌పీసీఎల్‌ స్కిల్‌ శిక్షణ కేంద్రం

విశాఖపట్నం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):

ముడసర్లోవ రోడ్డులో కృష్ణాపురం వద్ద జీవీఎంసీ భవనాల్లో గత తొమ్మిదేళ్లుగా నిర్వహిస్తున్న హెచ్‌పీసీఎల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ కేంద్రం ద్వారకానగర్‌ ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి మారబోతోంది. డిసెంబరులో సీఎం విశాఖ వస్తున్నందున వివిధ శాఖలకు అవసరమైన కార్యాలయాల కోసం జీవీఎంసీ తన భవనాలను సిద్ధం చేయాలని నిర్ణయించింది. గతంలో కృష్ణాపురంలో జోనల్‌ కార్యాలయం కోసం నిర్మించిన భవనాలను హెచ్‌పీసీఎల్‌కు అద్దెకు ఇచ్చింది. ఇప్పుడు వాటి అవసరం రావడంతో ఖాళీ చేయాలని కోరింది. దాంతో ఆ సంస్థ అధికారులు నగరంలో లలిత జ్యువెలర్స్‌ వెనకనున్న ద్వారకా నగర్‌ ఆర్టీసీ ఐదు అంతస్థుల భవనాన్ని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ కేంద్రం కోసం అద్దెకు తీసుకున్నారు. ఐదు అంతస్థుల్లో మొత్తం 86 వేల చదరపు అడుగుల స్థలం ఉంది. దానిని నెలకు రూ.12 లక్షల అద్దెకు తీసుకున్నారు. ఆ భవనానికి మరమ్మతులు చేయించి, రంగులు వేస్తున్నారు. మంగళవారం బోర్డు కూడా ఏర్పాటుచేశారు. సీఎం దెబ్బతో నగర శివార్లలోని కేంద్రం నడిబొడ్డుకు వచ్చింది.

Updated Date - 2023-11-29T01:18:34+05:30 IST