Share News

చంద్రబాబు సీఎం కావడం అవసరం

ABN , First Publish Date - 2023-11-29T00:09:07+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్య మంత్రి కావడం ఎంతో అవసరమని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బోనెల విజయ చంద్ర అన్నారు.

చంద్రబాబు సీఎం కావడం అవసరం

పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్య మంత్రి కావడం ఎంతో అవసరమని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బోనెల విజయ చంద్ర అన్నారు. పట్టణంలోని పదో వార్డులో మంగళవారం బాబు ష్యూరిటీ భవిష్య త్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన సూపర్‌సిక్స్‌ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొ బ్బిలి చిరంజీవులు, టీడీపీ నాయకులు డాక్టర్‌ భానుప్రసాద్‌, పి.సత్యనారాయణ, బా ర్నాల సీతారాం, కోలా మధుసూదనరావు పాల్గొన్నారు.

ఫ గుమ్మలక్ష్మీపురం: దుడ్డుకళ్లు గ్రామంలో ‘బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కురుపాం నియోజకవర్గం ఇన్‌చార్జి తోయక జగదీశ్వరి, క్లస్టర్‌ ఇన్‌చార్జి దాస్‌, ధర్మారావు, యూనిట్‌ ఇన్‌చార్జి అనీల్‌, బూత్‌ ఇన్‌చార్జి చిరంజీవి, రమేష్‌, సుందర రావు, జి.రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ మేరిఫెస్టోకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. వైసీపీని గద్దె దించి రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు.

Updated Date - 2023-11-29T00:09:09+05:30 IST