Share News

రాజన్నదొర ఏం చేశారు?

ABN , First Publish Date - 2023-11-29T00:07:56+05:30 IST

ఉప ముఖ్యమంత్రిగా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పీడిక రాజన్నదొర ఈ నియోజకవర్గానికి, సాలూరు పట్టణానికి ఏం చేశారో చెప్పాలని టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు ప్రశ్నించారు.

  రాజన్నదొర ఏం చేశారు?

సాలూరు: ఉప ముఖ్యమంత్రిగా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పీడిక రాజన్నదొర ఈ నియోజకవర్గానికి, సాలూరు పట్టణానికి ఏం చేశారో చెప్పాలని టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు ప్రశ్నించారు. పట్టణంలో టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్నదొరకు కేవలం పదవి కావాలి తప్ప ని యోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేకపోయినా పట్టదని ఆరోపించారు. పాచిపెం ట, సాలూరు మండలంలో ఉండాల్సిన గిరిజన విశ్వవిద్యాలయం పక్క జిల్లాకు పోవటానికి మీరు కారణం కాదా అని మంత్రిని ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లాగా ఆవిర్భంచిన తర్వాత ఆర్డీవో కార్యాలయం పాలకొండకు వెళ్లిపోయిందని అన్నారు. రైతులు అనావృష్టితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కరువు మండ లాలు ప్రకటించాలని కోరారు. టిడ్కో ఇళ్ళలో మీ ప్రమేయం ఏం ఉందని ప్రశ్నించారు. రివర్స్‌ టెండరింగ్‌ విధానం ద్వారా కోట్లు అవినీతి చేశారని అన్నారు. జగనన్న లేఅవుట్‌లలో వైసీపీ నాయకులు రూ.కోట్లలో డబ్బులు తిన్నారని విమర్శించారు. టిడ్కో ఇళ్ల చాలెంజ్‌కు రావాలని కోరారు. పట్టణంలో ఉన్న కాలనీలు అన్నీ ఎన్టీఆర్‌ కాలంలోనే ఉద్భవించాయని గుర్తు చేశారు. సమావేశంలో టీడీపీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ లక్ష్మోజీ, అర్బన్‌ బ్యాంక్‌ మాజీ అధ్యక్షులు కునిశెట్టి భీమారావు, బలగ పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:07:57+05:30 IST