Share News

కాలనీల్లో అవినీతి కంపు

ABN , First Publish Date - 2023-11-28T23:49:15+05:30 IST

ఎంతో ఆర్భాటంగా జగనన్న లేఅవుట్‌లలో ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నామని చెబుతున్నారు కానీ వాస్తవంగా ఆ కాలనీల్లో అవినీతి కంపు కొడుతుందని జనసేన జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు.

కాలనీల్లో అవినీతి కంపు
ఏలూరులో విలేకరులతో మాట్లాడుతున్న రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు కార్పొరేషన్‌, నవంబరు 28: ఎంతో ఆర్భాటంగా జగనన్న లేఅవుట్‌లలో ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నామని చెబుతున్నారు కానీ వాస్తవంగా ఆ కాలనీల్లో అవినీతి కంపు కొడుతుందని జనసేన జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. పవరుపేటలోని జనసేన కార్యాలయం వద్ద మంగళవారం ఆయన మాట్లాడుతూ లబ్ధిదారుల్లో కొందరు లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించుకుంటే తామే నిర్మించి ఇచ్చినట్టు ఏలూరు ఎమ్మెల్యే బిల్డప్‌ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. నగరానికి దూరంగా లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి పేదలను స్థానిక ఎమ్మెల్యే మోసగించారని ధ్వజమెత్తారు. పోణంగి కాలనీల్లో ఒక లబ్ధిదారులు తన కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకుంటే తానే నిర్మించినట్టు నాని తెలపడం తప్పుపట్టారు. ప్రజలపై అభిమానమే ఉంటే పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఎమ్మెల్యేకు సూచించారు. ప్రతీ ఎకరానికి లక్షలాది రూపాయలు కమీషన్లు తీసుకుని గృహ నిర్మాణాలకు పనికిరాని స్థలాలను కొనుగోలు చేశారని ఆరోపించారు.

Updated Date - 2023-11-28T23:49:16+05:30 IST