Share News

జ్యోతిరావు పూలే దార్శనికుడు

ABN , First Publish Date - 2023-11-28T23:33:26+05:30 IST

సమాన హక్కుల కోసం అట్టడుగు జాతుల విద్యాభివృద్ధి కోసం సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప దార్శనికుడని ఇన్‌చార్జి కలెక్టర్‌ బి.లావణ్య వేణి అన్నారు.

జ్యోతిరావు పూలే దార్శనికుడు
పూలే చిత్రపటం వద్ద ఇన్‌చార్జి కలెక్టర్‌ తదితరుల నివాళి

వర్ధంతి కార్యక్రమాల్లో పలువురి నివాళి

ఏలూరు కలెక్టరేట్‌, నవంబరు 28: సమాన హక్కుల కోసం అట్టడుగు జాతుల విద్యాభివృద్ధి కోసం సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప దార్శనికుడని ఇన్‌చార్జి కలెక్టర్‌ బి.లావణ్య వేణి అన్నారు. జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతిబా పూలే సమాజాభివృద్ధికి చేసిన కృషే నిదర్శనమని, సమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడని కొనియా డారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆర్‌వి.నాగరాణి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సత్యనారాయణ, పరిశ్రమల కేంద్రం జీఎం ఆదిశేషు, వివిధ విభాగాల అధికారులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు కార్పొరేషన్‌: జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని అగ్రహారంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో కాంగ్రెస్‌ నాయకులు నివాళులర్పించారు. పూలే చిత్రపటానికి కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్‌రావు పూలమాల వేశారు. పూలే అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతోపాటు మహిళోద్ధరణకు కృషి చేశారన్నారు. వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా ఆయన స్థాపించారన్నారు. బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొదటి వ్యక్తిగా చరిత్రలో పూలే నిలచి ఉంటారన్నారు. కాంగ్రెస్‌ నాయకులు దండుబోయిన చంద్రశేఖర్‌, గౌడు రంగబాబు, చెక్కా గుప్త, వైవీఎన్‌. మల్లే శ్వరరావు, నల్లగట్ల అనీల్‌మాణిక్యం, దాసరి రాంప్రసాద్‌, సాదే బాబూ ప్రసాద్‌, సుబ్బారావు, సూర్యనారాయణ, భూషణం, వీరం శ్రీధర్‌, కొమ్మారెడ్డి త్రిమూర్తులు, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

పవరుపేటలోని జనసేన కార్యాలయం వద్ద పూలే చిత్రపటానికి జనసేన జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు పూలమాల వేసి నివాళులర్పిం చారు. కుల వివక్ష నిర్మూలనకు, అంటరానితనానికి వ్యతిరేకంగా మహిళల విద్యా వ్యాప్తికి, సమాజ ప్రగతికి పూలే చేసిన సేవలను కొనియాడారు. ఆయన వెంట జనసేన నాయకులు సిరిపల్లి ప్రసాద్‌, బి.వి.రాఘవయ్యచౌదరి, ఒబిలిశెట్టి శ్రావణగుప్తా, బోండా రామునాయుడు, ఎట్రించి ధర్మేంద్ర, బొత్స మధు, అల్లు సాయిచరణ్‌, నూకల సాయిప్రసాద్‌, రవికుమార్‌ తదితరులు ఉన్నారు.

చింతలపూడి: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చింతలపూడి, ప్రగడవరం గ్రామాల్లో జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. చింతల పూడి మేడబడి సెంటర్‌లో పూలే విగ్రహానికి బోడా నాగభూషణ పూలమాల వేసి నివాళులర్పించారు. అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలన, మహిళలకు చదువులు అవసరమని పోరాడిన సామాజికవేత్తగా పేర్కొన్నారు. అనీష్‌ కుమార్‌, ఎంపీటీసీ విజయభాస్కర్‌, ఎం.థామస్‌, బాషా, యేబు తదితరులు పాల్గొన్నారు. ప్రగడవరంలో టీడీపీ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి సాధికార కమిటీ జిల్లా కన్వీనర్‌ కె.నాగరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు వర్గాల్లో చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి అన్నారు. చక్రపు మరేశ్వరరావు, కె.వీర్రాజు, రాంబాబు, చిమట బాబు, చెన్నారావు, సత్యనారాయణ పాల్గొన్నారు.

ఏలూరు రూరల్‌: ఏపీ బీసీ ఓబీసీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జడ్పీ కార్యాలయం వద్ద జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి ఫూలే విగ్రహాలకు పూల మాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎస్పీఆర్‌ విఠల్‌కుమార్‌, కన్వీనర్‌ పామర్తి ఏసురాజు, డి.వెంకటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, ఎం.శ్రీనివాస్‌, ఉక్కుసూరి గోపాలకృష్ణ, ఆదిశేషు, ఎంవి.సుబ్బారావు, వివిధ బీసీ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

––––––––––––––––––––––––––––

Updated Date - 2023-11-28T23:33:28+05:30 IST