Share News

గడువులోగా అర్జీల పరిష్కారం

ABN , First Publish Date - 2023-11-28T00:16:11+05:30 IST

స్పందనలో అందిన అర్జీలను గడువు లోగా పరిష్కరించాలని, అర్జీలకు సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని అధికారులకు ఇన్‌చార్జి కలెక్టర్‌ లావణ్యవేణి సూచించారు.

గడువులోగా అర్జీల పరిష్కారం
స్పందనలో ఇన్‌చార్జి కలెక్టర్‌ లావణ్యవేణి

ఇన్‌చార్జి కలెక్టర్‌ లావణ్యవేణి

ఏలూరు కలెక్టరేట్‌, నవంబరు 27 : స్పందనలో అందిన అర్జీలను గడువు లోగా పరిష్కరించాలని, అర్జీలకు సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని అధికారులకు ఇన్‌చార్జి కలెక్టర్‌ లావణ్యవేణి సూచించారు. కలెక్టరేట్‌లో సోమ వారం నిర్వహించిన స్పందనలో డీఆర్వో వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో సుబ్బా రావు, ఆర్డీవో ఎన్‌ఎస్‌కే ఖాజావలి, డీఆర్‌డీఏ పీడీ ఆర్‌.విజయరాజు, డిప్యూటీ కలెక్టర్‌ సత్యనారాయణతో కలిసి మొత్తం 228 అర్జీలు స్వీకరించారు. ఎక్కు వగా రెవెన్యూ, పౌరసరఫరాలు, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పెన్షన్లు, సర్వేలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలో నిర్వహిస్తున్న వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర నిర్వహణ షెడ్యూల్‌ను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి : ఎస్పీ

ఏలూరు క్రైం, నవంబరు 27 : ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ సురక్షి తంగా గమ్యస్థానాలకు వాహన దారులు చేరాలని ఎస్పీ మేరీ ప్రశాంతి సూచించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పంద నలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 50 మంది నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి అప్పటికప్పుడే సంబంధిత అధికారులకు ఫోన్‌లో ఆదేశాలు జారీ చేశారు. పెదవేగి మండలం నుంచి ఓ వృద్ధురాలు కుమారుడు, కోడలు తన బాగోలు చూడకుండా తన ఆస్తి రాయమని ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేయడానికి రావడంతో స్వయంగా ఎస్పీ వృద్ధురాలి వద్దకు వెళ్లి ఫిర్యాదు తీసుకుని తక్షణం చర్యలు తీసుకోవాలని పెదవేగి ఎస్‌ఐకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ వాహన దారులు వేగం వద్దు – ప్రాణాలు ముద్దు అనే విషయాన్ని గ్రహించాల న్నారు. ఏఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, ట్రైనీ డీఎస్పీ దివ్య, పాల్గొన్నారు.

Updated Date - 2023-11-28T00:16:13+05:30 IST