Share News

ధర్నాల హోరు

ABN , First Publish Date - 2023-11-27T23:57:00+05:30 IST

కలెక్టరేట్‌ ఆవరణ ధర్నాల హోరుతో దద్దరిల్లింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు.

ధర్నాల హోరు
గురుకుల విద్యార్థి బంధువుల ఆందోళన

కలెక్టరేట్‌ ఆవరణ ధర్నాల హోరుతో దద్దరిల్లింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. సంగం డెయిరీ మోసం చేసిందని, ఫారెస్ట్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని లింగపాలెం మండలానికి చెందినవారు, గురుకుల విద్యార్థి మృతికి కారకులను అరెస్ట్‌ చేయాలని బాధిత కుటుంబం, ఉంగుటూరు మండలంలో బహిర్భూమి స్థలం ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు.

గురుకుల విద్యార్ధి మృతికి కారకులను అరెస్టు చేయాలి

ఏలూరు కలెక్టరేట్‌, నవంబరు 27: పెదవేగి మండలం డీ బీఆర్‌ అంబేద్కర్‌ గురుకులంలో పదో తరగతి చదువుతున్న దాసి కమలేష్‌ ఆత్మహత్య కేసును విచారించి కారకులను కఠినంగా శిక్షించాలని, హాస్టల్‌ వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా చేశారు. ఈనెల 20న అనుమానాస్పద స్ధితిలో తన కుమారుడు మృతి చెందా డని, అదేరోజు రాత్రి 12.30 గంటలకు సమాచారం అందించారని దీంతో మృత దేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారని తెలిపారు. పెదవేగిలోని గురుకుల పాఠశాలకు వెళ్ళి ఆరా తీస్తే ప్రిన్సిపాల్‌, సిబ్బంది పొంతనలేని సమాధానం చెప్పారని, ఉరి వేసుకుని చనిపోయాడని చెప్పారని తెలిపారు. అది ఆత్మహత్య కాదని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని తమకు న్యాయం చేయాలని మృతుని తండ్రి డి.వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇన్‌ఛార్జి కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఆక్రమణలను తొలగించాలి

ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామంలో బహిర్భూమి కొంతమంది ఆక్రమించారని తక్షణం ఆక్రమణలు తొలగించాలని కోరుతూ బాదంపూడి గ్రామస్తులు, అంబేడ్కర్‌ సేవా సొసైటీ సభ్యులు సోమవారం కలెక్టరేట్‌ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. పలువురు మహిళలు మాట్లాడుతూ దళితు లకు చెందిన బహిర్భూమి (బయలుదొడ్డి) కొంతమంది ఆక్రమించి తప్పుడు దస్తావేజులు సృష్టించారన్నారు. దస్తావేజులపై విచారణ జరిపించాలని నిజ నిర్ధారణ చేసి ఆక్రమణలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. తక్షణం ఆక్రమ ణలు తొలగించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇన్‌ఛార్జి కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వెంకటేశ్వరరావు, విప్పర్తి ప్రసాద్‌, పి పద్మారావు, జైభీమ్‌ సేవా ట్రస్టు అధ్యక్షుడు పల్లి పద్మారావు, ముసళ్ళ రాజేష్‌, ఎంపీటీసీ పి.వరలక్ష్మి, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

పాడిరైతుల ఆందోళన

సంగం డెయిరీ యాజమాన్యం తీరుతో పాడిరైతులు తీవ్రంగా నష్టపోతున్నా రని, న్యాయం చేయాలని కోరుతూ లింగపాలెం మండలానికి చెందిన పలు వురు కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఇన్‌చార్జి కలెక్టర్‌ లావణ్యవేణిని కలసి వినతిపత్రం అందించారు. సంగం డెయిరీ ఉద్యోగులు తమ గ్రామాల్లో పాడిరైతులతో సమావేశాలు ఏర్పాటుచేసి వెన్న పది శాతం వస్తే లీటరు పాలకు రూ.80 చెల్లిస్తామని, బోనస్‌ ఇస్తామని లక్షల లీటర్లు సేకరించారని తెలిపారు. నేటికీ బోనస్‌ బకాయిలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల బోనస్‌ ఇవ్వాలని గుంటూరు వెళితే తమపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ లబ్దికోసం రైతులకు పార్టీలు ఆపాదిస్తు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని వినతిపత్రంలో కోరారు. ముసునూరి రాము, పలువురు రైతులు పాల్గొన్నారు.

ఫారెస్టు అధికారులపై చర్యలు తీసుకోవాలి

లింగపాలెం మండలం తోచిలకరాయుడుపాలెం గ్రామానికి చెందిన సర్వే నెంబర్‌ 1లో సామాజిక అటవీ భూమిని బడుగు, బలహీన వర్గాలు 24 కు టుంబాలు పంట పండించుకుంటుంటే కొందరు అటవీ శాఖ అధికారులు పూరి గుడిసెలను, పంటను ధ్వంసం చేశారని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకో వాలని దళితసేన వ్యవస్థాపక అద్యక్షుడు జిజ్జువరపు రవి ప్రకాష్‌, తదితరులు డీఆర్వోను కలిసి వినతిపత్రం అందజేశారు. 60 ఏళ్లుగా పంటలు పండించు కుంటూ జీవనం సాఽగిస్తున్నారని, చెట్టుపట్టాలు మంజూరు చేయాలని దరఖా స్తు చేసుకున్నట్లు తెలిపారు. చింతలపూడి ఫారెస్టు సెక్షన్‌ అధికారి ఉత్తర్వులతో పూరి గుడిసెలను ధ్వంసం చేశారు. ఫారెస్టు అధికారులపై చర్యలు తీసుకోవాల న్నారు. జయసుధ, ఇతియా, రవికుమార్‌, పి.విజయమ్మ పాల్గొన్నారు.

ఆటోలపై ఈచలానాలు రద్దు చేయాలి

ఏలూరు టూటౌన్‌: ఆటోలపై ఈచలానాల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, వాటిని రద్దు చేయాలని ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌ పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి డిమాండ్‌ చేశారు. సోమవారం స్పందనలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన అనంతరం ట్రాఫిక్‌ సీఐ కేవీఎస్‌వీ ప్రసాద్‌కు కూడా అందజేశారు. గోపి మాట్లాడుతూ నగరంలో ప్రధాన సిగ్నల్‌ పాయింట్స్‌ పాతబస్టాండ్‌, ఫైర్‌ స్టేషన్‌ ప్రాంతాల్లో సీసీకెమెరాలు లోపభూయిష్టంగా ఉన్నాయన్నారు. సీసీ కెమెరాలను సరైన దిశలో అమర్చకుండా వాహనాల పై ఫైన్లు విధించటం సహేతుకం కాదన్నారు. ప్రభుత్వం ఈచలానాల భారం మోపడం తీసివేయాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కిషోర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-27T23:57:04+05:30 IST