Bernard Arnaultg: బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఆస్తి విలువ రూ.19.8 లక్షలు కోట్లు... అసలు ఈయన ఎవరు?, ఏం చేసి ఇంత డబ్బు సంపాదించారు?.

ABN , First Publish Date - 2023-07-07T17:59:27+05:30 IST

బెర్నార్డ్ ఆర్నాల్ట్ (Bernard Arnault) సారధ్యంలోని ఎల్‌వీహెచ్ఎం‌ (LVMH) కంపెనీ విలువ ప్రస్తుతం 240 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందింది. భారతీయ కరెన్సీలో ఈ విలువ అక్షరాలా రూ.19.8 లక్షల కోట్లు. ఇక వ్యక్తిగతంగా 190 బిలియన్ డాలర్లతో ప్రపంచ సంపన్నుల జాబితాలో రెండవ స్థానంలో కొనసాగుతున్న ఉన్న ఈ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఎవరు?. అసలు ఏం వ్యాపారం చేస్తారు?. ఇంత సంపన్నుడెలా అయ్యారు?. అనే ఆసక్తికర విషయాలపై ఒక లుక్కేద్దాం...

Bernard Arnaultg: బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఆస్తి విలువ రూ.19.8 లక్షలు కోట్లు... అసలు ఈయన ఎవరు?, ఏం చేసి ఇంత డబ్బు సంపాదించారు?.

బెర్నార్డ్ ఆర్నాల్ట్ (Bernard Arnault) సారధ్యంలోని ఎల్‌వీహెచ్ఎం‌ (LVMH) కంపెనీ విలువ ప్రస్తుతం 240 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందింది. భారతీయ కరెన్సీలో ఈ విలువ అక్షరాలా రూ.19.8 లక్షల కోట్లు. ఇక వ్యక్తిగతంగా 190 బిలియన్ డాలర్లతో ప్రపంచ సంపన్నుల జాబితాలో రెండవ స్థానంలో కొనసాగుతున్న ఉన్న ఈ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఎవరు?. అసలు ఏం వ్యాపారం చేస్తారు?. ఇంత సంపన్నుడెలా అయ్యారు?. అనే ఆసక్తికర విషయాలపై ఒక లుక్కేద్దాం...

బెర్నార్డ్ ఆర్నాల్ట్ (Bernard Arnault) ఫ్రాన్స్‌కు చెందిన వ్యాపారం దిగ్గజం. బహుళజాతి లగ్జరీ గూడ్స్ కంపెనీ ఎల్‌వీహెచ్ఎం‌ని (LVMH) స్థాపించింది ఈయనే. వ్యవస్థాపకుడిగా, సీఈవోగా ఎంతో దూరదృష్టి, ప్రణాళికాబద్ధంగా కంపెనీని వృద్ధిబాటలో నడిపిస్తున్నారు. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 500 బిలియన్ డాలర్లు (రూ.41.37 లక్షల కోట్లు) దాటిందంటే కంపెనీ ఏ స్థాయికి ఎదిగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఫ్యాషన్ ప్రపంచంలో అందరికీ సుపరిచితమైన, అతిపెద్ద బ్రాండ్లు అయిన లూయిస్ విట్టోన్, క్రిస్టియాన్ డియోర్, ఫెండీ, టిఫానీ అండ్ కో.. ఇవన్నీ ఎల్‌వీఎంహెచ్ (LVMH) గొడుగు కిందివే కావడం గమనార్హం.

కెరీర్ తొలినాళ్లలో ..

బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఉత్తర ఫ్రాన్స్ పట్టణం రొబిక్స్‌లో పుట్టారు. క్యాథలిక్ కుటుంబానికి చెందిన ఈయన ఒక క్యాథలిక్ స్కూల్ విద్య పూర్తి చేశారు. తన కుటుంబ సభ్యులు లగ్జరీ బ్రాండ్స్‌పై చూపించే మక్కువను గమనించిన ఆయన లగ్జరీ బ్రాండ్ గూడ్స్‌ వ్యాపారంలోకి ప్రవేశించడానికి కారణమైంది. ఎకోలే పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన అనంతరం.. అప్పటికే తన తండ్రి స్థాపించిన ‘ఫెర్రెట్-సావినెల్’ అనే కంపెనీని తన చేతుల్లోకి తీసుకున్నారు. 1978-1984 మధ్యకాలంలో కంపెనీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం 74 ఏళ్ల వయసున్న బెర్నాల్డ్ ఆర్నాల్ట్ ప్రపంచ లగ్జరీ ఫ్యాషన్ రంగంలో పెట్టుబడుల విషయంలో చాలా తెలివిగా అడుగులు వేస్తూ ఎదిగారు. మొదటి పెట్టుబడితో తన తల్లికి ఎంతో ఇష్టమైన బ్రాండెడ్ కంపెనీ ‘క్రిస్టియన్ డియోర్‌’ను కొనుగోలు చేశారు. ఇందుకోసం 15 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత చాలా వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టారు.

Untitled-2.jpg

టెర్మినేటర్‌గా పేరు...

బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు ‘‘ ది టెర్మినేటర్ ’’ అనే పేరుంది. రెండేళ్ల వ్యవధిలోనే ఏకంగా 9000 మందికిపైగా ఉద్యోగులను తొలగించడమే ఈ పేరు రావడానికి కారణమైంది. ఫ్యాషన్ బ్రాండ్ల కోసం అప్పటికే ఉన్న కంపెనీ ఆస్తులను పెద్ద ఎత్తున విక్రయించారు. ఈ విధంగా వేర్వేరు ఆస్తులను విక్రయించి ఫ్యాషన్ బ్రాండ్లు ‘సెలిన్’ను కొనుగోలు చేశారు. ఫ్రెంచ్ డిజైనర్ క్రిస్టియన్ లాక్రొయిక్స్‌కు భారీగా నిధులు సమకూర్చారు. మొత్తంగా ఆర్నాల్డ్ ప్రణాళికలు 1987 నాటికి లాభాలరూపం దాల్చాయి. ఆ తర్వాత క్రమక్రమంగా ఆయన ఫ్రాన్స్ బిజినెస్ మాగ్నెట్‌గా ఎదిగిపోయారు. అదే 1987లో ఎల్‌వీహెచ్ఎం‌ కంపెనీని స్థాపించేందుకు లూయిస్ విట్టోన్ ప్రెసిడెంట్ హెన్నీ, మోయిట్ హెన్నెస్సీ సీఈవో అలైన్ చెవ్‌లియర్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఆ తర్వాతే అసలుసిసలైన ‘మాస్టర్ మైండ్‌’గా మారిపోయారు. కంపెనీలో అంతర్గత ఆధిపత్యం కోసం వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెంచారు. 1989లో ఏకంగా 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి ఎల్‌వీహెచ్ఎంలో 43.5 శాతం షేర్లను హస్తగతం చేసుకున్నారు. ఇందులో 35 శాతం షేర్లకు ఓటింగ్ రైట్స్ ఉండడంతో కంపెనీ విభజనకు అవకాశం లేకుండా జాగ్రత్తపడ్డారు. తన పవర్‌ని ఉపయోగించి 1989లో కంపెనీ ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ప్రపంచ టాప్ 10 స్టాక్స్‌ జాబితాలో చోటుపొందిన ఏకైక యూరోపియన్ కంపెనీగా ఎల్‌వీఎంహెచ్ నిలిచింది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ 240 బిలియన్ డాలర్లుగా ఉంది. కంపెనీకి చెందిన 75 బ్రాండ్లు ఫ్యాషన్, బ్యూటీ, యాక్సెసరిస్, వైన్, ఫ్రాగ్నాన్స్, ఇతర రంగాలకు చెందినవి.

లగ్జరీ లైఫ్...

బెర్నార్డ్ లగ్జరీ ఉత్పత్తుల కంపెనీని నడిపించడమే కాదు.. కూడా లగ్జరీ లైఫ్‌ని అనుభవిస్తారు. ఏకంగా రూ.1648 కోట్ల విలువైన రాజభవనంలో నివసిస్తున్నారు. తన కుటుంబ సభ్యులతోపాటు ఆ ఇంట్లోనే ఉంటారు. విడిది కోసం సముద్ర తీర ప్రాంతంలో రూ.100 కోట్ల విలువైన మరో భవంతి కూడా ఉంది. అంతేకాదు.. లాస్ ఏంజెల్స్, బెరెల్లీ హిల్స్, హాలీవుడ్ హిల్స్ సహా వేర్వేరు ప్రాంతాల్లోనూ విలాసవంతమైన నివాసాలు ఆయనకు ఉన్నాయి. అత్యంత విలాసవంతమైన నౌక ఒక దానిని కొనుగోలు చేశారు. ప్రపంచంలో టాప్-100 నౌకల్లో ఒకటైన దీని పేరు ‘సింఫనీ’ (Symphony). ఇక డసాల్ట్ ఫాల్కన్ 7ఎక్స్ అనే ఒక ప్రైవేటు విమానం కూడా ఉంది. దీని విలువ రూ.329 కోట్లు. ఇండిగో అనే 135 ఎకరాల ఐలాండ్‌ను కూడా కొనుగోలు చేశారు.

Updated Date - 2023-07-07T18:00:59+05:30 IST